Demat Account: మీ డీమ్యాట్ ఎక్కౌంట్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ టిప్స్ పాటించండి

Demat Account: ఆన్‌లైన్ వినియోగం పెరిగేకొద్దీ దుష్పరిణామాలు కూడా ఎక్కువౌతున్నాయి. డిజిటల్ లావాదేవీల కాలంలో సైబర్ మోసాలు ఊహించని రూపాల్లో పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడీ బెడద షేర్ మార్కెట్‌కు కూడా తాకింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 6, 2023, 11:44 PM IST
Demat Account: మీ డీమ్యాట్ ఎక్కౌంట్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ టిప్స్ పాటించండి

Demat Account: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్‌లైన్ లావాదేవీలే కన్పిస్తున్నాయి. యూపీఐ చెల్లింపులు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ ట్రేడింగ్ అంతా అరచేతిలోనే.‌ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌తో ఎంత సౌకర్యమో అంతే మోసం కూడా పొంచి ఉంటోంది. 

ఆన్‌లైన్ మోసాలు ఇప్పుడు షేర్ మార్కెట్ రంగంలో కూడా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా డీమ్యాట్ ఎక్కౌంట్‌లో చాలా మోసాలు పొంచి ఉంటున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులని హెచ్చరిస్తున్నారు సైబర్ మార్కెట్ నిపుణులు.షేర్ మార్కెట్‌ ట్రేడింగ్ చేయాలంటే.. డీమ్యాట్ ఎక్కౌంట్ తప్పనిసరి. డీమ్యాట్ ఎక్కౌంట్ ద్వారానే షేర్ల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. ఈ షేర్ల వివరాలు మీ డీమ్యాట్ ఎక్కౌంట్‌లో ఉంటాయి. ఇప్పుడు హ్యాకర్లు ఈ ఎక్కౌంట్లపై కన్నేస్తున్నారు. మీ ఎక్కౌంట్ వివరాలు, ట్రేడింగ్ వివరాలపై నిఘా పెడుతూ మీకు తెలియకుండానే సంగ్రహిస్తున్నారు. 

ఎందుకంటే సాధారణంగా డీమ్యాట్ ఎక్కౌంట్‌లో నిధులు యాడ్ చేసి ట్రేడింగ్ చేస్తుంటారు. అంటే డీమ్యాట్ ఎక్కౌంట్‌లో షేర్లతో పాటు డబ్బులు కూడా ఉంటాయి. డీమ్యాట్ ఎక్కౌంట్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. అందుకే ముప్పు కచ్చితంగా పొంచి ఉంటుంది. చాలా సులభంగా సైబర్ మోసగాళ్లు మీ ఎక్కౌంట్‌లో చొరబడి మీ డబ్బుల్ని కాజేసే ప్రమాదం లేకపోలేదు. అందుకే డీమ్యాట్ ఎక్కౌంట్ ఉంటే కొన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకోవాలి.

డీమ్యాట్ ఎక్కౌంట్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవడం

డీమ్యాట్ ఎక్కౌంట్ హ్యాకింగ్ లేదా మోసానికి గురి కాకుండా ఉండాలంటే మీరు ఎంచుకునే పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎక్కడా రాసుకోకూడదు. గుర్తుంచుకోవాలి. పాస్‌వర్డ్‌లో బ్రాకెట్స్ వంటి స్పెషల్ క్యారెక్టర్లు ఎక్కువగా ఉపయోగిస్తే మంచిది. అంతేకాకుండా తరచూ మారుస్తుండాలి. స్పెషల్ లెటర్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే..పాస్‌వర్డ్ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. మరో ముఖ్యమైన సూచన ఎప్పటికప్పుడు ఎక్కౌంట్ స్టేట్‌మెంట్ పరిశీలిస్తుండాలి.

డీమ్యాట్ ఎక్కౌంట్ హ్యాక్ కాకుండా ఉండేందుకు మీ ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవాలి. డిపాజిటరీ ద్వారా మీకు పంపించిన అన్ని స్టేట్‌మెంట్లు, ఎస్ఎంఎస్‌లు పూర్తిగా పరిశీలించాలి. డీమ్యాట్ ఎక్కౌంట్ లావాదేవీలు, మీ ట్రెండింగ్ యాక్టివిటీలతో సరిపోల్చుకోవాలి. ఏ మాత్రం తేడా కన్పించినా ఫిర్యాదు చేయాలి. ట్రేడింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ బహిరంగ ప్రదేశాల్లో వైఫై నెట్‌వర్క్ వాడకూడదు. మొబైల్ డేటా ఒక్కటే వాడటం మంచిది. 

Also read: Big Saving Days Flipkart 2023: 180 లీటర్స్ గోద్రెజ్ రిఫ్రిజిరేటర్ కేవలం రూ.750లకే.. ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News