Budget 2024 India: కేంద్ర నుంచి గుడ్‌ న్యూస్‌..భారీగా తగ్గనున్న మొబైల్స్‌..

Smartphones Get Cheaper: స్మార్ట్‌ ఫోన్స్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి కేంద్ర శుభవార్తలు తెలిపింది. మొబైల్‌ స్పేయిర్‌ పార్ట్స్‌పై దిగుమతులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా స్మార్ట్‌ ఫోన్స్‌ ధరలు తగ్గే చాన్స్‌ ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2024, 05:38 PM IST
Budget 2024 India: కేంద్ర నుంచి గుడ్‌ న్యూస్‌..భారీగా తగ్గనున్న మొబైల్స్‌..

 

Smartphones Get Cheaper:  స్మార్ట్‌ఫోన్‌ యూజర్స్‌కి కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ తెలిపింది. బడ్జెట్‌లో భాగంగా స్మార్ట్‌ ఫోన్‌ స్పేయిర్‌ పార్ట్స్‌పై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతం వరకు తగ్గించబోతున్నట్లు ప్రకటించింది. దీని కారణంగా అన్ని కంపెనీలకు సంబంధించిన విడిభాగాలు అతి తక్కువ ధరకే లభించనున్నాయి. దీంతో బడ్జెట్‌ తర్వాత మొబైల్‌ ధరలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా వెల్లడించింది.  

కేంద్ర తగ్గించి మొబైల్‌ స్పేయిర్‌ పార్ట్స్‌లో బ్యాక్ కవర్స్,  బ్యాటరీలు వాటి ఎన్‌క్లోజర్‌లు, బ్యాంక్‌ కెమెరా లెన్స్‌ వంటి వివిధ రకాల మెకానికల్‌ భాగాలు ఉన్నట్లు తెలుస్తోంది. దిగుమతి సుంకాలు తగ్గడం వల్ల కొత్త మొబైల్ ధరలపై ప్రభావం పడే ఛాన్స్‌ ఉంది. కేంద్రం భారత్‌లోని స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన తయారీ వ్యాయాన్ని మరింత తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైనాతో పాటు ఇతర దేశాలు ప్రాంతీయ పోటీదారులతో మన దేశం కూడా సమానంగా ఉండేందుకు ఈ సుంకాన్ని తగ్గించింది. అయితే ఇప్పటికే కొన్ని టెక్‌ కంపెనీ సుంకాలను తగ్గించాలని కోరిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వం విడిభాగాలకు సంబంధించిన సుంకాలను తగ్గిస్తే దాదాపు గత రెండు సంవత్సరాల్లో జరిగిన మొబైల్ ఫోన్ ఎక్స్‌పోర్ట్స్‌ 11 బిలియన్ల నుంచి 39 బిలియన్లకు పెరిగే ఛాన్స్‌ ఉందని ICEA(ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్) వెల్లడించింది. ఈ సంవత్సరంలోని భారత్‌లోని టెక్‌ కంపెనీలు దాదాపు 50 బిలియన్లకు పైగా విలువైన స్మార్ట్‌ ఫోన్స్‌ను తయారు చేస్తున్నట్లు ఐసీఈఏ తెలిపింది. ఇది కాస్త వచ్చే సంవత్సరం 60 బిలియన్స్‌కు పెరిగే ఛాన్స్‌ ఉంది. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

ICEA ఛైర్మన్ మాట్లాడుతూ..
ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం స్వాగతించే విషయామేనని అన్నారు. అంతేకాకుండా భారత్‌లోని స్మార్ట్ ఫోన్‌ తయారీని ప్రపంచ దేశాలకు పోటీగా మార్చడం, ముందు ముందు భారత్‌ను ఎలక్ట్రిక్ గ్లోబల్ హబ్‌గా తయారు చేయడం కీలకపరిణామన్నారు. ఎక్స్‌పోర్ట్స్‌ ఆధారిత వృద్ధితో పాటు పోటీతత్వం పట్ల భారత ప్రభుత్వం ధోరణి మరింత గొప్ప అవకాశాలను ఇస్తోందన్నారు.  

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News