Share Price: ఐటీ రంగంలో ఇన్వెస్టర్లకు ముంచేసిన ఆ 3 కంపెనీల షేర్లు

Share Price: షేర్ మార్కెట్‌లో ఈ ఏడాది ఐటీ రంగం పరిస్థితి బాగాలేదు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో ఈ ఏడాది క్షీణత కన్పిస్తోంది. ముఖ్యంగా మూడు ఐటీ కంపెనీలు ఇన్వెస్టర్లను ముంచేశాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 18, 2022, 08:57 PM IST
Share Price: ఐటీ రంగంలో ఇన్వెస్టర్లకు ముంచేసిన ఆ 3 కంపెనీల షేర్లు

2022 ఏడాది మరి కొద్దిరోజుల్లోనే ముగియనుంది. ఈ ఏడాది షేర్ మార్కెట్‌‌లో చాలా కీలక పరిణామాలున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు మరోసారి ఆల్ టైమ్ హై నమోదు చేసిన పరిస్థితి ఉంది. అదే సమయంలో ఐటీ రంగం మాత్రం నష్టాల్నే చవిచూసింది.

ఈ ఏడాది షేర్ మార్కెట్ చాలామందిని ధనవంతులుగా మార్చేసింది. చిన్న చిన్న కంపెనీ షేర్లు ముఖ్యంగా మల్టీబ్యాగర్ స్టాక్స్ అద్భుతమైన లాభాల్ని ఆర్జించాయి. అదే సమయంలో ఐటీ రంగం షేర్లు మాత్రం ఇన్వెస్టర్లకు నష్టాన్ని మిగిల్చాయి. షేర్ మార్కెట్‌లో ఐటీ రంగంలో ఈ ఏడాది క్షీణత కన్పించింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో ఈ ఏడాది పరిస్థితి బాగాలేదు. ముఖ్యంగా మూడు దిగ్గజ ఐటీ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చాయి.

ఇన్‌ఫోసిస్ షేర్ ధర

2022 లో ఇన్‌ఫోసిస్, టీసీఎస్, విప్రో షేర్లు చాలా క్షీణించాయి. ఏడాదంతా ఈ మూడు కంపెనీల షేర్లత తగ్గుదలే కన్పించింది. విప్రో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. విప్రో షేర్ ఈ ఏడాది సగానికి పడిపోయింది. విప్రో షేర్లలో ఇంకా క్షీణత కన్పిస్తోంది. డిసెంబర్ 16 నాటికి ఇన్‌ఫోసిస్ షేర్ ధర 1521.50 రూపాయలుగా ఉంది. 52 వారాల కనిష్ట ధర 1355 రూపాయలకు చేరుకుంది. ఈ ఏడాదిలో 20 శాతం కంటే తక్కువే నమోదైంది.

టీసీఎస్

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్‌లో ఈ ఏడాది క్షీణత నమోదైంది. షేర్‌లో ఈ ఏడాది దాదాపు 15 శాతం కంటే ఎక్కువే తగ్గుదల కన్పించింది. ఎన్ఎస్ఈలో షేర్ ధర 52 వారాల గరిష్టం 4043 రూపాయలు కాగా, ఈ ఏడాది 2926.10 రూపాయలకు పడిపోయింది. ఇదే 52 వారాల కనిష్ట ధర. డిసెంబర్ 16 2022  షేర్ క్లోజింగ్ ధర 3235.95 రూపాయలుంది.

విప్రో

విప్రో ఈ ఏడాది ఇన్వెస్టర్లకు చాలా దారుణంగా దెబ్బతీసింది. ఈ కంపెనీ షేర్ ధరలో ఇంకా క్షీణత కన్పిస్తోంది. ఈ ఏడాది 52 వారాల గరిష్ట ధర 726.80 రూపాయలకు చేరుకుంది. విప్రో 52 వారాల కనిష్ట ధర 372.40 రూపాయలైంది. డిసెంబర్ 16 న విప్రో షేర్ ధర 389.60 రూపాయలకు క్లోజ్ అయింది.

Also read: LPG Cylinder Booking: తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేయండి.. భారీ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News