/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

PF Transfer: ఈపీఎఫ్ఓ కార్యాలయం నుంచి కీలకమైన సమాచారం వెలువడింది. ఇప్పుడు క్షణాల్లోనే పీఎఫ్ బదిలీ చేసుకోవచ్చు. పాత కంపెనీ పీఎఫ్‌ను ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మార్చుకోవచ్చు.

చాలామందికి పీఎఫ్ సంబంధిత విషయాల్లో చాలా సందేహాలుంటాయి. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకు మారినప్పుడు పాత కంపెనీ పీఎఫ్‌ను ఎలా బదిలీ చేసుకోవాలనేది ముఖ్యంగా ఎదురయ్యే ప్రశ్న. అందుకే ఈపీఎఫ్ఓ కార్యాలయం కీలకమైన సమాచారం వెలువరించింది. దీని ప్రకారం ఇక క్షణాల్లోనే మీరు పాత పీఎఫ్‌ను బదిలీ చేసుకోవచ్చు. ఎన్ని కంపెనీలు మారినా..పాత కంపెనీ పీఎఫ్ బ్యాలెన్స్ ప్రస్తుతం ఉన్న కంపెనీకు మార్చుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం...

పీఎఫ్ బదిలీ చేసేందుకు మీకు యాక్టివ్ యూఎన్ నెంబర్ పాస్‌వర్డ్ కచ్చితంగా ఉండాలి. అది కాకుండా మీ యూఏఎన్ నెంబర్‌లో బ్యాంక్ ఎక్కౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటి వివరాలన్నీ అప్‌డేట్ అయి ఉండాలి. 

పీఎఫ్ ఎక్కౌంట్ బ్యాలెన్స్ చెక్ ఎలా చేయాలి

ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్  https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ యూఎన్ నెంబర్, పాస్‌వర్డ్ , క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కావాలి. హోమ్ పేజ్‌లో మెంబర్స్ ప్రొఫైల్ క్లిక్ చేసి..మీ వ్యక్తిగత వివరాలు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీ పేరు ఆధార్ వివరాలు, పాన్‌కార్డ్ వివరాలు వెరిఫై చేసుకోవాలి. తరువాత ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు కూడా చెక్ చేసుకోవాలి. పీఎఫ్ బదిలీ చేసేముందు పాస్‌బుక్ ఒకసారి చెక్ చేసుకోవాలి. దీనికోసం వ్యూ ఆప్షన్ క్లిక్ చేస్తే పాస్‌బుక్ ఆప్షన్ కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేసి..మరోసారి లాగిన్ కావాలి. సెలెక్ట్ మెంబర్ ఐడీ క్లిక్ చేసే మొత్తం పేజ్ ఓపెన్ అవుతుంది. 

మీరు గతంలో చేసిన కంపెనీల మెంబర్ ఐడీలు కన్పిస్తాయి ఇందులో కింద కన్పించే మెంబర్ ఐడీ ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీది. ఇక్కడ వ్యూ పాస్‌బుక్‌లో క్లిక్ చేస్తే..అన్ని కంపెనీల పీఎఫ్ బ్యాలెన్స్ కన్పిస్తుంది. 

పాత పీఎఫ్ కొత్త ఎక్కౌంట్లో ఎలా బదిలీ చేయాలి

పాత పీఎఫ్ బదిలీ చేసేముందు ఎంట్రీ, ఎగ్జిట్ డేట్ అప్‌డేట్ కావాలి. వ్యూ ఆప్షన్ క్లిక్ చేసి..సర్వీస్ హిస్టరీ ఆప్షన్‌లో వెళ్లాలి. మీ పాత కంపెనీ రెండు తేదీల్ని అప్‌డేట్ చేసుంటే..మీ పీఎఫ్ సులభంగా బదిలీ అవుతుంది. మీరు ఆన్‌లైన్ సర్వీసెస్‌లో వెళ్లి..ONE MEMBER ONE EPF ACCOUNT క్లిక్ చేయాలి. ఇప్పుుడు మీ ముందు ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ వ్యక్తిగత సమాచారముంటుంది. ఇది కాకుండా..ప్రస్తుత కంపెనీ పీఎఫ్ ఎక్కౌంట్ వివరాలుంటాయి. ఇందులో మీ పాత పీఎఫ్ డబ్బులుంటాయి. దీనికింద పాత ఎంప్లాయర్ వివరాలుంటాయి. దీంతో పీఎఫ్ బదిలీ అవుతుంది. ఇక్కడ పీఎఫ్ బదిలీ చేసుకునేవాళ్లు ప్రస్తుత కంపెనీ లేదా పాత ఎంప్లాయర్ నుంచి అప్రూవ్ తీసుకోవాలి. ఆ తరువాత యూఏఎన్ వివరాలు ఎంటర్ చేయాలి. ఇలా చేయగానే..గతంలో చేసిన అన్ని కంపెనీల పీఎఫ్ ఐడీలు కన్పిస్తాయి. ఏ డబ్బులు బదిలీ చేయాలో..దాన్ని సెలెక్ట్ చేయాలి. తరువాత ఓటీపీ ద్వారా నిర్ధారించుకుంటే చాలు..మీ బదిలీ ప్రక్రియ పూర్తవుతుంది. 

Also read: LIC New Schemes: రిటైర్మెంట్ తరువాత సెక్యూరిటీ, ఎల్ఐసీలో కొత్త పధకం వివరాలు ఇవీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
EPFO Updates, how to transfer your previous company pf to present company, here is the process
News Source: 
Home Title: 

PF Transfer: మీ పాత కంపెనీ పీఎఫ్‌ను క్షణాల్లో ఇలా బదిలీ చేసుకోండి, ఎలాగంటే

PF Transfer: మీ పాత కంపెనీ పీఎఫ్‌ను క్షణాల్లో ఇలా బదిలీ చేసుకోండి, ఎలాగంటే
Caption: 
PF Transfer ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
PF Transfer: మీ పాత కంపెనీ పీఎఫ్‌ను క్షణాల్లో ఇలా బదిలీ చేసుకోండి, ఎలాగంటే
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Friday, August 26, 2022 - 19:11
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
78
Is Breaking News: 
No