Fuel Prices: దేశంలో ఇంధన ధరలు, యూపీఏ, మోదీ ప్రభుత్వంలో ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీ ఇలా

Fuel Prices: ఇంధన ధరలు వారం రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని ఆయిల్ కంపెనీలు ఇవాళ ఏప్రిల్ 16వ తేదీన ఇంధన ధరల్లో ఏ విధమైన మార్పులు చేయలేదు. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి పెట్రోల్-డీజిల్ ధరలు ఇలా  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 16, 2022, 08:58 AM IST
Fuel Prices: దేశంలో ఇంధన ధరలు, యూపీఏ, మోదీ ప్రభుత్వంలో ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీ ఇలా

Fuel Prices: ఇంధన ధరలు వారం రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని ఆయిల్ కంపెనీలు ఇవాళ ఏప్రిల్ 16వ తేదీన ఇంధన ధరల్లో ఏ విధమైన మార్పులు చేయలేదు. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి పెట్రోల్-డీజిల్ ధరలు ఇలా

ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ఇవాళ అంటే ఏప్రిల్ 16వ తేదీన పెట్రోల్ -డీజిల్ ధరల్లో మార్పులు చేయలేదు. గత వారం రోజులుగా ఉన్న ధరే కొనసాగుతోంది. ఏప్రిల్ 6వ తేదీన లీటర్ పెట్రోల్-డీజిల్ ధరలో 80 పైసలు పెంచిన ఆయిల్ కంపెనీలు ఆ తరువాత ఏ విధమైన మార్పు చేయలేదు. 

దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 1.5.41 రూపాయలు కాగా డీజిల్ 96.67 రూపాయలుంది. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ 120.51 రూపాయలు కాగా, డీజిల్ 104.77 రూపాయలుంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ 110.85 రూపాయలు కాగా, డీజిల్ ధర 100.94 రూపాయలుంది. ఇక కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ 115.12 రూపాయలు కాగా, డీజిల్ ధర 99.83 రూపాయలుంది. 

దేశంలో ఇంధన ధరలు నవంబర్ 4వ తేదీ 2021  తరవాత నుంచి 2022 మార్చ్ 21 వరకూ స్థిరంగా ఉన్నాయి. ఆ తరువాత ఇంధన ధరలు మారాయి. క్రిసిల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం గత 4 నెలల్లో ఆయిల్ కంపెనీలకు భారీ నష్టమే కలిగింది. ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ధరల్ని 15 నుంచి 20 రూపాయలు పెంచాల్సి వస్తుంది. అయితే లీటర్ డీజిల్‌పై 25 రూపాయలు, పెట్రోల్ పై 23 రూపాయలు పెంచినంతమాత్రాన నష్టం పూడుకుపోదని కూడా ఆ నివేదిక తెలిపింది. 

8 ఏళ్లలో పెట్రోల్‌పై 2 వందల శాతం పెరిగిన ట్యాక్స్

2021 నవంబర్ 4  కంటే ముందు మోదీ ప్రభుత్వం పెట్రోల్‌పై 32.90 రూపాయలు, డీజిల్‌పై 31.80 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేసేది. 2014లో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత...క్రూడ్ ఆయిల్ ధరల్లో తగ్గుదల రావడంతో ఎక్సైజ్ డ్యూటీ పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. మోదీ ప్రభుత్వం అధికారంలో రాకముందు పెట్రోల్‌పై 9.20 రూపాయలు, డీజిల్‌పై 3.46 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. కానీ మోదీ ప్రభుత్వం పెట్రోల్‌పై 23.7 రూపాయలు, డీజిల్‌పై 28.34 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపధ్యంలో పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించింది. అయినా సరే మోదీ ప్రభుత్వం పెట్రోల్‌పై 27.90 రూపాయలు, డీజిల్‌పై 21.80 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తోంది. ఇది యూపీఏ హయాం కంటే...పెట్రోల్‌పై 2 వందల శాతం, డీజిల్‌‌పై 530 శాతం ఎక్కువ. 

Also read: Tata Play 49 Plan: టాటా ప్లే DTH బంపర్ ఆఫర్.. రూ.49లకే ప్రముఖ OTTల సబ్‌స్క్రిప్షన్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News