Gold Rate Today Hyderabad: బంగారం ధరలు మళ్లీ భారీగా పెరగడం ప్రారంభించాయి దీంతో పసిడి ధర ఒక్కసారిగా రికార్డు స్థాయిలో పెరిగింది. ఆగస్టు 18, ఆదివారం బంగారం తాజా ధరలు ఎలా ఉన్నాయో చూస్తే పసిడి ప్రియులకు దిమ్మ తిరగడం ఖాయం. బంగారం ధర రికార్డు స్థాయిలో పెరగింది. దీంతో 24 క్యారట్ల 10 గ్రాముల పసిడి ధర 1100 రూపాయలు పెరిగి రూ.72,770కి చేరుకుంది. దీంతో బంగారం ధర మరోసారి 75 వేల రూపాయల దిశగా కదులుతోంది.
ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల బంగారం ధరలు దేశీయంగా భారీగా పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ కారణంగానే భారీగా పెరిగినట్లు నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలో శుక్రవారం స్పాట్ గోల్డ్ ధరలు ఔన్సు అంటే 31 గ్రాములకు గానూ రికార్డు స్థాయిలో 2,509 డాలర్లకు చేరుకుంది.
Also Read : Gold Rate: బంగారం ధర దీపావళి నాటికి రూ. 80 వేలు తాకే అవకాశం..కారణాలు ఇవే
నికి తోడు బలహీనపడిన US డాలర్ విలువ కారణంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలతో బంగారం ధర సడెన్ గా పెరిగింది. ఆర్థిక మాంద్యం భయాలతో US ఆర్థిక వ్యవస్థ బంగారం మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలు భారీగా పెరగటం ప్రారంభించాయి. హైదరాబాదులో 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 72,770 పలుకుతుండగా, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,770 వద్ద ఉంది.
మరోవైపు బంగారం ధరలు భవిష్యత్తులో కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రెండు ఇలాగే కొనసాగినట్లయితే అతి సమీప సమయంలోనే, బంగారం ధరలు సుమారు 75 వేల రూపాయలు కూడా దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం ధరలు ఈ రేంజ్ లో పెరగడంతో శ్రావణమాసంలో పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ఎందుకంటే బంగారం ధరలు పెరగటం వల్ల ఆభరణాలు కొనుగోలు చేసేవారు నిరాశక్తకు గురి అయ్యే అవకాశం ఉందని ఆభరణాల తయారీదారులు పేర్కొంటున్నారు.
గత వారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఒక్కసారిగా అమెరికాలో బంగారం ధరలు పెరగడంతో మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు బంగారం ధర రికార్డు స్థాయి దిశగా కదులుతూ ఉండటం కూడా పసిడి ప్రియుల ఆందోళనలో మరింత పెంచుతుంది. బంగారం ధరలు భారీగా పెరగడంతో అటు పసిడి ప్రియులు ఈ రేంజ్ లో బంగారం కొనుగోలు చేయాలా వద్దా అనే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Banks: ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా? అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేదా?అయితే పెనాల్టీ ఛార్జీలు ఇవే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook