ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంకుల్లో హెచ్‌డిఎఫ్‌సి అగ్రగామిగా ఉంది. కొత్త పథకాలు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరోసారి ఎఫ్‌డివడ్డీ రేట్లను పెంచింది. కొత్త రేట్ల వివరాలు మీ కోసం.
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీను 15 నెలల్నించి 2 ఏళ్లకు 7.15 శాతం చేయగా, 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకైతే 7 శాతంగా నిర్ణయించారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పరిమితిని బట్టి మారుతుంటుంది. 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకూ డిపాజిట్ పై వడ్డీ రేటును పెంచింది. 7 రోజుల్నించి 10 ఏళ్ల వరకూ సాధారణ పౌరులు 4.50 నుంచి 7 శాతం వరకూ వడ్డీ పొందుతారు. అటు సీనియర్ సిటిజన్లు 5 నుంచి 7.75 శాతం వడ్డీ అందుకుంటారు.
15 నెలల్నించి 2 ఏళ్ల వరకూ ఉన్న డిపాజిట్లపై వడ్డీరేటులోనే ప్రధానమైన మార్పు సంభవించింది. ఇది 7.15 శాతంగా ఉంది. అదే సీనియర్ సిటిజన్లకు 5-10 ఏళ్ల డిపాజిట్లపై గరిష్టంగా 7.75 శాతం వడ్డీ ఇస్తోంది. జనవరి 27, 2023 నుంచి కొత్త వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
7-29 రోజుల్లో మెచ్యూరిటీ పూర్తయ్యే డిపాజిట్లపై బ్యాంకు 4.50 శాతం వడ్డీ అందిస్తోంది. 30-45 రోజుల డిపాజిట్లపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 5.25 శాతం వడ్డీ ఇస్తోంది. ఇప్పుడు కొత్తగా 46-60 రోజుల డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ ఇవ్వనుంది. అదే 61-89 రోజుల డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ ఇవ్వనుంది.
ఇక 90 రోజుల్నించి 6 నెలల డిపాజిట్లపై బ్యాంక్ 6.25 శాతం వడ్డీ ఇస్తుండగా..6-9 నెలల వరకైతే 6.50 శాతం వడ్డీ ఇస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కొత్త వడ్డీ రేట్ల ప్రకారం 9 నెలల నుంచి 1 సంవత్సరం వరకూ మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.65 శాతం వడ్డీ అందిస్తోంది. అదే 1 ఏడాది నుంచి 15 నెలల్లో మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లపై 7 శాతం వడ్డీ ఉంటుంది.
15 నెలల్నించి 2 ఏళ్లలో మెచ్యూరిటీ పూర్తయ్యే డిపాజిట్లపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 7.15 శాతం వడ్డీని అందిస్తుంది. అటు 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకైతే 7 శాతం వడ్డీ ఉంటుంది.
Also read: Go First: 55 మంది ప్రయాణికులను విడిచివెళ్లిన గోఫస్ట్‌పై భారీ జరిమానా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook