How to Repay Home Loan Easily: హోమ్ లోన్ ఇఎంఐ చెల్లించడం భారమైందా ? ఇలా చేయండి

How to Repay Home Loan Easily: హోమ్ లోన్ వడ్డీ రేటు కనిష్టంగా 8.50 శాతానికే లభిస్తే.. ఇంకొన్నిసార్లు సిబిల్ స్కోర్ ని బట్టి 14.75 శాతం వరకు వడ్డీ రేటు చార్జ్ చేస్తుంటారు. ఒకవేళ మీ హోమ్ లోన్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ పద్ధతిలో తీసుకున్నట్టయితే... వడ్డీ రేట్లు పెరిగే కొద్ది మీ హోమ్ లోన్ వడ్డీ రేటు కూడా పెరుగుతూపోతుంది.

Written by - Pavan | Last Updated : Oct 7, 2023, 07:53 PM IST
How to Repay Home Loan Easily: హోమ్ లోన్ ఇఎంఐ చెల్లించడం భారమైందా ? ఇలా చేయండి

How to Repay Home Loan Easily: సొంతిల్లు కొనుక్కోవాలని అందరికి ఉంటుంది. కానీ ఆ కలను నిజం చేసుకునేందుకు ఎంతో చమటోడ్చాల్సి ఉంటుంది. ఎందుకంటే సొంతిల్లు అనేది చాలామందికి ఖరీదైన కలే అవుతుంది కనుక. ఈ ఖరీదైన కలను నిజం చేసుకునేందుకు చాలామంది హోమ్ లోన్ తీసుకుంటారు. కానీ ఆ హోమ్ లోన్ కూడా అధిక వడ్డీలు, అధిక ఇఎంఐల కారణంగా అవి భారంగా పరిణమిస్తుంటాయి. అందులోనూ చాలా ఏళ్లపాటు ఇఎంఐ చెల్లించాల్సి రావడం అనేది మరింత భారంగా అనిపిస్తుంది. ఒక్కోసారి వడ్డీ రేటు కనిష్టంగా 8.50 శాతానికే లభిస్తే.. ఇంకొన్నిసార్లు సిబిల్ స్కోర్ ని బట్టి 14.75 శాతం వరకు వడ్డీ రేటు చార్జ్ చేస్తుంటారు. ఒకవేళ మీ హోమ్ లోన్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ పద్ధతిలో తీసుకున్నట్టయితే... వడ్డీ రేట్లు పెరిగే కొద్ది మీ హోమ్ లోన్ వడ్డీ రేటు కూడా పెరుగుతూపోతుంది. హోమ్ లోన్ తీసుకునే వారు ఎంత ఎక్కువ కాలం ఇఎంఐ చెల్లిస్తే.. అంత ఎక్కువ మొత్తంలో మీరు లోన్ తీసుకున్న బ్యాంకుకి అధిక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా హోమ్ లోన్ భారాన్ని పెంచే అంశాలే. అందుకే హోమ్ లోన్ ఇఎంఐ భారం కాకుండా బయటపడాలంటో ఏం చేయాలో తెలియకపోతే... ఇదిగో ఇటువైపు ఓ లుక్కేయండి. 

వడ్డీ రేటు రీరైటింగ్ ఆప్షన్ :
కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు వారి వడ్డీ రేటును రీరైట్ చేసుకునే అవకాశం ఇస్తుంటాయి. ఇలా రీరైటింగ్ చేయడం వల్ల మీ సిబిల్ స్కోర్ ఆధారంగా మీ వడ్డీ రేటు తగ్గుతుంది. ఎంత మెరుగైన సిబిల్ స్కోర్ ఉంటే.. మీకు అంత మెరుగైన వడ్డీ రేటు లభించే అవకాశం ఉంటుంది. ఇది మీ ఈఎంఐ భారాన్ని గణనీయంగా తగ్గించేలా చేస్తుంది. ఉదాహరణకు ప్రస్తుతం మీ హోమ్ లోన్ వడ్డీ రేటు 14 శాతం ఉండి, మీ సిబిల్ స్కోర్ 750 కంటే పైగా ఉన్నట్టయితే.. మీ వడ్డీ రేటు 9 నుండి 10 శాతానికి తగ్గే అవకాశం ఉంటుంది. వడ్డీ రేటు రీరైటింగ్ కోసం రూ. 5 వేలు నుండి రూ. 10 వేల వరకు ఛార్జ్ చేస్తారు. 

రీఫైనాన్స్ :
మీ హోమ్ లోన్ రీఫైనాన్స్ చేయడం ద్వారా తక్కువ వడ్డీ రేటు పొందే అవకాశం ఉంటుంది. రీఫైనాన్స్ అంటే ఇప్పుడు హోమ్ లోన్ ఉన్న బ్యాంకు నుండి మరో బ్యాంకుకి మీ లోన్ ని బదిలీ చేయడమే. ఇలా చేయడం వల్ల మీ సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటే.. వడ్డీ రేటు తగ్గుతుంది. తద్వారా ఇఎంఐ భారం తగ్గుతుంది. 

ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటు నుండి ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్ : 
ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటు పద్ధతిలో హోమ్ లోన్ తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు పెంచిన ప్రతీసారి వడ్డీ రేటు పెరిగి హోమ్ లోన్ ఇఎంఐ పెరుగుతుంటుంది. అలా కాకుండా ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్న వారికి ఆ సమస్య ఉండదు. అందుకే మీ బ్యాంకును సంప్రదించి అవకాశం ఉంటే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ నుండి ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్ కి మారడం ఉత్తమం. ఒకవేళ మీ బ్యాంక్ అందుకు అంగీకరించకపోతే... మీరు మీ లోన్ ని మరో బ్యాంకుకి బదిలీ చేయడం వల్ల కూడా ఆ పని చేయవచ్చు అనే విషయం మర్చిపోకండి. అలా మీ వడ్డీ రేటు పెరగకుండా చూసుకున్న వారు అవుతారు. 

క్రెడిట్ కార్డులు, ఇతర రుణాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : 
కొంతమంది హోమ్ లోన్ సమయానికి చెల్లిస్తున్నాం కదా అనే చూస్తారు కానీ క్రెడిట్ కార్డులు, ఇతర రుణాలను సకాలంలో చెల్లిస్తున్నామా లేదా అనే విషయాన్ని పట్టించుకోరు. క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఇతర రుణాల ఇఎంఐలు కూడా సకాలంలో చెల్లించకపోతే అవి మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినేలా చేస్తాయి. అదే కానీ జరిగితే.. అది మీ హోమ్ లోన్ వడ్డీ రేటు పెరిగేలా చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే మీరు తీసుకున్న ఇతర రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లులు కూడా సకాలంలో చెల్లించడం ముఖ్యం అనే విషయం గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి : న్యూరో42 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో లీడ్ ఇన్వెస్టర్ కృష్ణ భూపాల్‌ నియామకం

అడ్వాన్స్ పేమెంట్ : 
మీకు వీలైతే ఎప్పటికప్పుడు ఎంతో కొంత మొత్తాన్ని హోమ్ లోన్ ఖాతాలో జమ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీ హోమ్ లోన్ ఔట్‌స్టాండింగ్ ఎమౌంట్ తగ్గడమే కాకుండా ఇఎంఐ భారం కూడా తగ్గుతుంది. లేదంటే మీరు ఇఎంఐ చెల్లించాల్సిన గడువు కాలమైనా తగ్గుతుంది. 

ఇది కూడా చదవండి : 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. త్వరలోనే ప్రకటన..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News