EPFO Withdraw Limit: EPFO ఖాతాలో మొత్తం డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవాలి? ఏ ఫారమ్ అవసరం..

EPFO Withdraw Limit: ఈపీఎఫ్ఓ ఖాతా మీకు ఉందా? మీరు ఎప్పుడైనా పీఎఫ్ డబ్బును  విత్‌డ్రా చేసుకున్నారా? ఈ భవిష్యనిధి నుంచి మీరు డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. దీని నుంచి ఎంత మొత్తం డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు తెలుసా?

Written by - Renuka Godugu | Last Updated : Mar 26, 2024, 01:36 PM IST
EPFO Withdraw Limit: EPFO ఖాతాలో మొత్తం డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవాలి? ఏ ఫారమ్ అవసరం..

EPFO Withdraw Limit: ఈపీఎఫ్ఓ ఖాతా మీకు ఉందా? మీరు ఎప్పుడైనా పీఎఫ్ డబ్బును  విత్‌డ్రా చేసుకున్నారా? ఈ భవిష్యనిధి నుంచి మీరు డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. దీని నుంచి ఎంత మొత్తం డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు తెలుసా?

ప్రతినెలా మన జీతంలో నుంచి కొంత భాగం పీఎఫ్ అమౌంట్ కట్ అవుతుంది. ఇందులో మరికొంత భాగం కంపెనీ భాగం అది కూడా జమా అవుతుంది. ఇది మన భవిష్యనిధి.. ఇలా ఈపీఎఫ్ఓ విధానం దేశవ్యాప్తంగా ఉంటుంది. పదవీ విరమణ పొందిన తర్వాత ఈ డబ్బు మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. మన అవసరల నిమిత్తం ఈ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మధ్యలో ఉద్యోగ విరమణ చెందిన తర్వాత  కూడా ఈ డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయం కలుగుతుంది.

అయితే, భవిష్యనిధి నుంచి డబ్బు మన అవసర నిమిత్తం తీసుకోవచ్చు. ఈ పెన్షన్ విత్‌డ్రా 10C, 10D ఫారమ్ అవసరం అవుతుంది. కానీ, సాధారణంగా దాదాపు పది సంవత్సరాలు పనిచేస్తేనే ఇందులో నుంచి పూర్తిగా డబ్బు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుందనేది అపోహ.. పది సంవత్సరాలోపు పనిచేసిన ఉద్యోగులు కూడా తమ అవసరాల నిమిత్తం డబ్బు విత్‌ డ్రా చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

ఇదీ చదవండి:  బిజినెస్ లోన్ కోసం చూస్తున్నారా, ఇలా అప్లై చేయండి చాలు, జీరో వడ్డీతో రుణాలు

ఫారమ్ 10C అంటే ఒక ఉద్యోగి పది సంవత్సరాలు పనిచేయకుండానే తమ ఖాతాలో నుంచి పూర్తి డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది. ఇలా చేయానుకునే ఉద్యోగులు ఫారమ్‌ 10C పూర్తి చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఫారమ్ తోనే ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. పెన్షన్ స్కీమ్ సర్టిఫికేట్ ను కూడా పొందవచ్చు. ఫారమ్ 10D ఈ పత్రం ఈపీఎఫ్ఓ అర్హత కోసం నమోదు చేస్తారు. అంతేకాదు పదవీ విరమణ పది సంవత్సరాలు పూర్తైన ఉద్యోగులు నింపాల్సి ఉంటుంది. 

ఇదీ చదవండి: తక్కువ చెల్లింపుతో దర్జాగా నెలకు రూ.5 వేలు పొందే అద్భుత పథకం

అయితే, ఫారమ్ 19, 31 లు మాత్రం ఉద్యోగులు తమ అవసరాల నిమిత్తం కొంత భాగం పీఎఫ్ ఖాతా నుంచి విత్‌ డ్రా చేసుకుంటారు. వాటికి ఈ ఫారమ్ 31 నమోదు చేయాల్సి ఉంటుంది. దీన్నే ఈపీఎఫ్ఓ క్లెయిమ్ అని కూడా అంటారు. ఈ ఫారమ్ ద్వారా డబ్బు పొందాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈపీఎఫ్ మొత్తం పొందాలంటే ఫారమ్ 19 పూర్తి చేయాలి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News