Income tax Returns: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఈ మార్పులు గమనించకపోతే సమస్యలే

Income tax Returns: ఇన్‌కంటాక్స్ పేయర్లకు అలర్ట్. ఇన్‌కంటాక్స్ శాఖ కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేముందు తప్పకుండా తెలుసుకోవల్సిన అంశాలివి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 13, 2023, 03:48 PM IST
Income tax Returns: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఈ మార్పులు గమనించకపోతే సమస్యలే

Income tax Returns: ఐటీ రిటర్న్స్‌కు సంబంధించి మార్పులు చేర్పులతో కూడిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్లకు ఈ విషయాలు తప్పనిసరి. ప్రతి యేటా ఫైల్ చేసినట్టే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ మార్పుల్ని గమనించాల్సి ఉంటుంది. 

ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి కీలకమైన అప్‌డేట్స్ వెలువడ్డాయి. మొట్టమొదటి సారి రిటర్న్స్ ఫైల్ చేస్తున్నా లేదా ప్రతి యేటా చేసినట్టే చేస్తున్నా సరే ఈ మార్పుల్ని పరిశీలించాలి. ఐటీ రిటర్న్స్ సరిగ్గా ఫైల్ చేసేందుకు ఈ మార్పులు దోహదపడతాయి. లేకపోతే తప్పులు దొర్లే అవకాశాలుంటాయి. ఫలితంగా సమస్యలు ఎదురుకావచ్చు. డిజిటల్ కరెన్సీ అంటే క్రిప్టో కరెన్సీ బదిలీతో వచ్చే ఆదాయంపై 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు సర్‌ఛార్జ్, సెస్ కూడా చెల్లించాలి. క్రిప్టో కరెన్సీ నుంచి వచ్చే ఆదాయంపై  ఖర్చుకు ఏ విధమైన తగ్గింపు ప్రయోజనం లభించదు. ఈ విధమైన ఆదాయంపై ఐటీఆర్ 1 లేదా ఐటీఆర్ 4 ఫైల్ చేయలేరు. దీనికోసం ఐటీఆర్ 2 లేదా ఐటీఆర్ 3 సమర్పించాల్సి ఉంటుంది. 

ఇన్‌కంటాక్స్ సెక్షన్ 115 ఏసి ప్రకారం ఆప్షనల్ ట్యాక్స్ విధానం ఎంచుకోవచ్చు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు న్యూ ట్యాక్స్ విధానంతో ట్యాక్స్ పేయర్లకు రిలీఫ్ ఇచ్చారు. అయితే పాత ట్యాక్స్ విధానంలో ఏ విధమైన మార్పులు చేయలేదు. 

ఇన్‌కంటాక్స్ సెక్షన్ 80 జి ప్రకారం డిడక్షన్ క్లెయిమ్ చేస్తుంటే దానం చేసిన రసీదు, ఫామ్ 10ఈ సమర్పించాల్సి ఉంటుంది. ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసేందుకు ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్ ఫామ్‌లో ఉండే సెక్షన్ 80జి లో వివరాలు సమర్పించాలి. ఇంట్రా ట్రేడింగ్‌తో కలిగే ప్రయోజనాలు లేదా నష్టాల వివరాలు అందించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఐటీఆర్ ఫామ్‌లో ప్రత్యేక సెక్షన్ పార్ట్ ఓ ట్రేడింగ్ ఎక్కౌంట్ కోసం పెట్టారు. ఈ సెక్షన్‌లో మీరు మీ ట్రేడింగ్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.ఐటీఆర్ ఫామ్‌లో ట్రేడింగ్ టర్నోవర్, దానిపై కలిగే లాభం వివరాలు తప్పకుండా పొందుపర్చాలి.

Also read: ZEEL: సెబీ ఆర్డర్‌పై జీ అధికారిక ప్రకటన.. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కృషి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News