Top 4 Hybrid Cars: దేశంలో పెట్రోల్, ఎలక్ట్రిక్ ఇంజన్ కలిగిన టాప్ 4 హైబ్రిడ్ కార్లు, మైలేజ్ , ధర వివరాలు

Top 4 Hybrid Cars: దేశంలో కార్ల వినియోగదారుల ప్రాధాన్యతలు, అవసరాలు మారుతున్నాయి. మైలేజ్, సౌకర్యం వంటి ఫీచర్లు కోరుకుంటున్నారు. కారు కంపెనీలు కూడా అందుకు తగ్గట్టే కార్లను మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 4, 2023, 11:25 AM IST
Top 4 Hybrid Cars: దేశంలో పెట్రోల్, ఎలక్ట్రిక్ ఇంజన్ కలిగిన టాప్ 4 హైబ్రిడ్ కార్లు, మైలేజ్ , ధర వివరాలు

Top 4 Hybrid Cars: ఇప్పుడు కొత్త హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్-ఎలక్ట్రిక్ ఇంధనాల మధ్య అవసరాన్ని బట్టి మార్చుకునేలా కొత్త రకం కార్లు వస్తున్నాయి. ఇండియాలో ఇప్పటికే చాలామంది హైబ్రిడ్ కార్లను ప్రవేశపెట్టాయి. పనితీరు, ఎకానమీ, పర్యావరణం ఇలా అన్నింట్లో ఈ హైబ్రిడ్ కార్లు అత్యుత్తమంగా నిలుస్తున్నాయి. అలాంటి టాప్ 4 హైబ్రిడ్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టొయోటా అర్బన్ క్రూయిజనర్ హైరైడర్

ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ టెక్నాలజీ కలిగిన కారు. టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ లీటర్‌కు 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర 16.46 లక్షలు కాగా టాప్ గ్రేడ్ 19.99 లక్షల వరకూ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా తక్కువే. 

టొయోటా ఇన్నోవా హైక్రాస్

టొయోటా కంపెనీకు చెందిన మరో అద్భుతమైన 7 -8 సీటర్ కారు ఇది. 2 లీటర్ ఇంజన్ కలిగి ఉంటుంది. 172.99 హెచ్‌పి పవర్, 209 ఎన్ఎం టార్క్ జనరేట్ చేసే సామర్ద్యం కలిగింది. ట్యాంక్ ఫ్యూయల్ కెపాసిటీ 52 లీటర్లు. ఈ కారు మైలేజ్ 16.13 నుంచి 23.24 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర 18.54 లక్షలతో ప్రారంభమై 29.98 లక్షల వరకూ ఉంటుంది. 

మారుతి సుజుకి ఇన్విక్టో

మారుతి సుజుకి కంపెనీ కొత్తగా లాంచ్ చేసిన కారు ఇది. ఈ కారు ధర 24.79 లక్షల నుంచి 28.42 లక్షల వరకూ ఉంటుంది. మారుతి ఇన్విక్టో 2.0 లీటర్ పెట్రోల్, హైబ్రిడ్ ఇంజన్ కలిగి ఉంటుంది. 188 ఎన్ఎం టార్గ్ జనరేట్ చేయడమే కాకుండా 112 కిలోవాట్స్ అవుట్ పుట్ ఇస్తుంది. మైలేజ్ 23.24 కిలోమీటర్లు ఇవ్వగలదు. సీటింగ్ కెపాసిటీ 7 మంది. 

మారుతి సుజుకి గ్రాండ్ విటారా

మారుతి సుజుకి గ్రాండ్ విటారా 1.5లీటర్ పెట్రోల్ ఇంజన్ తో అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉంది. ఈ కారు మైలేజ్ ఏకంగా 27.97 కిలోమీటర్లు ఇస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర 18.29 లక్షల నుంచి ప్రారంభమై 19.79 లక్షల వరకూ ఉంటుంది. 

Also read:CIBIL Score And Personal Loan In terest Rates: సిబిల్ స్కోర్‌ని బట్టే పర్సనల్ లోన్స్ వడ్డీ రేట్లు నిర్ణయిస్తారా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News