Union Railway Minister Ashwini Vaishnaw quashed all rumours of privatisation of Indian Railways: ఇండియన్ రైల్వేను ప్రైవేటీకరించనున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం (Ashwini Vaishnaw on Railways Privatisation) చేశారు. భారత ఐకానిక్ రవాణా వ్యవస్థ అయిన రైల్వైను ప్రైవేటీకరించమని తెలిపారు. భవిష్యత్‌లోను అలాంటి నిర్ణయం ఉండదని (Indian Railways will not be privatised) వివరించారు.
ఇటీవల మీడియాతో మాట్లాడిన అశ్విని వైష్ణవ్.. రైల్వైను ప్రైవేటీకరించే విషయంపై కేంద్రం ఎలాంటి చర్చలు జరపడంలేదని వెల్లడించారు. రైల్వే అనేది క్లిష్టమైన వ్యవస్థ అని పేర్కొన్నారు.
రైల్వే ప్రయాణికులు, టీ స్టాల్ వ్యాపారులు నుంచి ఇటీవల నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు అశ్విని వైష్ణవ్. ఇది సేవల మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.
ఇదే విషయంపై ఇంతకు ముందు..
రైల్వై ప్రైవేటీకరణ అంశం చర్చల్లోకి రావడం ఇది తొలిసారి కాదు. ఇది వరకు చాలా సార్లు దీనిపై చర్చ జరిగింది. రైల్వైను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అశ్విని వైష్ణవ్‌కు ముందు.. ఆ మంత్రి పదవిలో ఉన్న పీయూష్ గోయల్ కూడా ఇది వరకే ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. రైల్వై ఎన్నటికీ ప్రైవేటు పరం చేయబోమని స్పష్టం (Piyush Goyal Railways Privatisation) చేశారు.
'రైల్వే భారత ఆస్తి, ఇది ప్రతి భారతీయుడి ఆస్తి. ఎప్పటికీ దీనిని ప్రైవేటు పరం చేయబోము.' అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు పీయూష్ గోయల్. అయితే ప్రైవేటు పెట్టుబడులు రైల్వై పనితీరును మెరుగుపరుస్తాయని ఆయన పేర్కొనడం గమనార్హం.
ఈ అంచనాలకు కారణాలు..
గత కొంత కాలంగా ప్రభుత్వం.. పలు సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవలే ఎయిర్ ఇండియాను ప్రైవేటు సంస్థకు విక్రయించింది. దీనితో పాటు త్వరలో రెండు బ్యాంకులను ప్రైవేటీకరించనుంది. ఎల్ఐసీని ఐపీఓకు తీసుకురానుంది. వీటన్నింటితో పాటు.. పలు రైల్వై స్టేషన్ల మెయింటనెన్స్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల.. రైల్వైలో ప్రైవేటు పెట్టుబడులపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే రైల్వైను ప్రైవేటీకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also read: Bounce electric scooter : బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు వచ్చేశాయి.. ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ
Also read: Banks Strike: ఈ నెలలో రెండు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం- ఎందుకంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook