Indigo Vaxi Fare: విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇండిగో విమానాల్లో 10 శాతం డిస్కౌంట్!

Indigo Vaxi Fare: కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులకు తమ విమానాల్లో 10 శాతం డిస్కౌంట్ తో ప్రయాణించే వీలును కల్పిస్తున్నట్లు ఇండిగో విమానాయాన సంస్థ ప్రకటించింది. 'వ్యాక్సీ ఫేర్' పేరుతో ఉన్న ఈ ఆఫర్ లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు.. తాము విమానంలోకి ఎక్కే ముందు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2022, 02:58 PM IST
    • విమాన ప్రయాణికులకు ఇండిగో విమానయాన సంస్థ శుభవార్త
    • వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులకు 10% శాతం డిస్కౌంట్
    • కేవలం భారత్ లో ప్రయాణించే వారికే ఈ ఆఫర్ అని ప్రకటన
Indigo Vaxi Fare: విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇండిగో విమానాల్లో 10 శాతం డిస్కౌంట్!

Indigo Vaxi Fare: విమాన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ శుభవార్త చెప్పింది. కొవిడ్ వ్యాక్సినేషన్ పొందిన కస్టమర్లకు బేస్ ఫేర్ పై 10 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ ఆఫర్ పేరును 'వ్యాక్సీ ఫేర్'గా ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. ఈ 10 శాతం ఆఫర్ కేవలం దేశీయ విమానాలపై వర్తిస్తుందని స్పష్టం చేసింది. దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రోత్సహించడం సహా ప్రయాణికులు మళ్లీ ప్రయాణాలు చేసే విధంగా ఈ ఆఫర్ తో చొరవ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 

కానీ, ఈ ఆఫర్ ను పొందేందుకు కొన్ని షరతులు కూడా ఉన్నట్లు ఇండిగో విమానాయాన సంస్థ స్పష్టం చేసింది. ప్రయాణికులు టికెట్ బుక్ చేసే సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా భారత్ లో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. అది కూడా థార్డ్ పార్టీ వెబ్ సైట్ లలో కాకుండా ఇండిగో వెబ్ సైట్ లో టికెట్ బుక్ చేసుకున్న వారికే ఇది వర్తిస్తుందని వెల్లడించింది. 

అంతే కాకుండా.. ఈ టికెట్ బుక్ చేసుకున్న 15 రోజుల తర్వాత ఆ ప్రయాణానికి సంబంధించిన డిస్కౌంట్ పొందుతారని ఇండిగో పేర్కొంది. ఈ ఆఫర్ తో టికెట్ పొందిన ప్రయాణికులు.. ఎయిర్ పోర్ట్ లో బోర్డింగ్ అయ్యే సమయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన వ్యాక్సిన ధ్రువీకరణ పత్రాన్ని లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా వ్యాక్సినేషన్ స్టేటస్ ను తెలియజేయాలని వెల్లడించింది. అలా చేయని పక్షంలో డిస్కౌంట్ ను తిరిగి వెనక్కి తీసుకోవడం సహా విమానంలోకి అనుమతించమని ఇండిగో స్పష్టం చేసింది.  

Also Read: Gold Price Today : దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల వివరాలు..

Also Read: Budget 2022 Impacts: బడ్జెట్ 2022 ఏయే రంగాలపై ఎలాంటి ప్రభావం చూపించనుంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News