Gram Suraksha Yojana: చిల్లర ఖర్చు పెడితే చాలు రూ.లక్షల్లో లాభం.. రూ.50 పెడితే రూ.30 లక్షలు

Check Out Post Office Gram Suraksha Yojana Full Details: రోజులో చేసే చిల్లర ఖర్చుతో భారీగా లాభం సంపాదించే అద్భుతమైన పథకం ఉంది. మీరు చేయాల్సిందల్లా రోజుకు కొంత పెట్టుబడి పెడితే చాలు రూ.లక్షల్లో లాభం పొందే గొప్ప పథకం పేరు గ్రామ సురక్ష పథకం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 14, 2024, 06:34 PM IST
Gram Suraksha Yojana: చిల్లర ఖర్చు పెడితే చాలు రూ.లక్షల్లో లాభం.. రూ.50 పెడితే రూ.30 లక్షలు

Gram Suraksha Yojana: మన రోజువారీ ఖర్చుల్లో కొంత పొదుపు చేస్తే చాలు భవిష్యత్‌లో చాలా ఉపయోగపడతాయి. ప్రైవేటులో పెట్టుబడి పెడదామంటే నమ్మకం.. విశ్వసనీయత లేకపోవడంతో వెనుకడుగు వేస్తుంటారు. డబ్బులు వృథా.. మోసం జరుగుతుందనే భయం ఉంటుంది. అలాంటి వారికి ప్రభుత్వ పథకాలు ఎంతో మేలు చేస్తాయి. వాటిలో తపాలా శాఖకు చెందిన పథకాలు ప్రజలకు ఆర్థిక భరోసానిస్తాయి. తపాలా శాఖ తక్కువ పెట్టుబడి అధిక లాభాలు అందిస్తుంటుంది. వాటిలో ముఖ్యమైన గ్రామ సురక్ష పథకం. ఈ పథకంలో రూ.50 పెట్టుబడి పెడితే చాలు రూ.30 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.

Also Read: Vaikunta Ekadasi: తిరుమల భక్తులకు షాక్‌.. ఆ రోజుల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు

భారతీయ తపాలా శాఖ వివిధ పొదుపు పథకాలను నిర్వహిస్తోంది. పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టి రూ.లక్షలాది మంది మంచి రాబడులు పొందుతున్నారు. ప్రజలు పోస్టాఫీసు పథకాల్లో డబ్బును పెట్టుబడి పెడితే అధిక ఆదాయం పొందవచ్చు. పోస్టాఫీసులో డబ్బు పెట్టుబడి పెట్టడం సురక్షితం. మీ డబ్బును సురక్షితమైన మంచి రాబడి పొందుతారు. గ్రామ సురక్ష పథకం అనేది తపాలా శాఖ పథకం. ఈ పథకంలో కేవలం రూ.50 పెట్టుబడి పెడితే రూ.35 లక్షలు సంపాదన పొందుతారు.

Also Read: K Kavitha: ఎమ్మెల్సీ కె కవిత సంచలనం.. రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లికి 'కాంగ్రెస్ మాత'గా నామకరణం

గ్రామ్ సురక్ష పథకం గ్రామీణ ప్రాంత జీవిత బీమా పథకంలో ఒక భాగం. దేశంలోని గ్రామీణ ప్రజల కోసం ఈ బీమా పాలసీని 1995లో ప్రారంభించారు. గ్రామ సురక్ష పథకంలో 19 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్నవారు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి చేయవచ్చు. ఈ పథకంలో ప్రీమియం చెల్లించడానికి చాలా ఎంపికలు ఉన్నాయి. 

పథకం వివరాలు

  • ఈ పథకం కింద ప్రీమియం నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక చెల్లింపులుగా ఉన్నాయి. 
  • గ్రామ సురక్ష పథకం కింద రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే రూ.35 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు.
  • 19 ఏళ్ల వయసులో గ్రామ సురక్ష యోజన చేసి 60 ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే రూ.34.60 లక్షల లాభం వస్తుంది.
  • ఈ పథకంలో చేరితే మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం కూడా లభిస్తుంది.

దరఖాస్తు ఇలా..

  • మీకు సమీపంలోని తపాలా కార్యాలయానికి వెళ్లాలి.
  • గ్రామ సురక్ష పథకం దరఖాస్తు పత్రం పొంది మీ వివరాలు నమోదు ఏయాలి
  • దరఖాస్తు పత్రంతోపాటు మీ గుర్తింపు కార్డుతోపాటు చిరునామా, వయసు ధ్రువీకరణ పత్రాలు జతచేర్చాలి.
  • దరఖాస్తుతోపాటు ఇతర పత్రాలు తపాలా శాఖ అధికారులకు అందించాలి. అనంతరం మీ ప్లాన్‌ ప్రకారం ప్రీమియం చెల్లింపు చేయాలి.
  • అన్ని పత్రాలను ధ్రువీకరించిన అనంతరం అధికారులు పాలసీ ధ్రువపత్రం ఇస్తారు. ఇక ఆ తర్వాతి నుంచి మీరు ప్రీమియం చెల్లించవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News