Mahindra SUV Cars: మహీంద్రా స్కార్పియో ఎన్ వర్సెస్ మహీంద్రా థార్ రాక్స్ మధ్య అంతరమేంటి

Mahindra SUV Cars: దేశంలో వివిధ కంపెనీల కార్లు ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఒకే కంపెనీకు చెందిన రెండు కార్లు పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలో మహీంద్రా స్కార్పియో ఎన్ వర్సెస్ మహీంద్రా థార్ రాక్స్ వివరాలు, ఫీచర్లు ఓసారి పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 21, 2024, 06:22 PM IST
Mahindra SUV Cars: మహీంద్రా స్కార్పియో ఎన్ వర్సెస్ మహీంద్రా థార్ రాక్స్ మధ్య అంతరమేంటి

Mahindra SUV Cars: మహీంద్రా స్కార్పియో ఎన్, మహీంద్రా థార్ రాక్స్ రెండూ పవర్ ఫుల్ ఎస్‌యూవీ సెగ్మెంట్ లోకే వస్తాయి. రెండింటిలోనూ అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. రెండింటి బేసిక్ మోడల్ ధరలో మాత్రం తేడా ఉంటుంది. చాలామంది బేసిక్ మోడల్ కొనేందుకే ఆసక్తి చూపిస్తుంటారు. అసలు ఈ రెండింటీ మద్య తేడా ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మహీంద్రా స్కార్పియో ఎన్

మహీంద్ర స్కార్పియో ఎన్ బేసిక్ మోడల్ అంటే జెడ్ 2 పెట్రోల్ ఇంజన్ ఎస్‌యూవీ. ఇందులో 5 సీటర్, 7 సీటర్ రెండూ ఉంటాయి. ఇందులో ఫీచర్లు చాలానే ఉన్నాయి. బేసిక్ మోడల్ కారణంగా ప్రీమియం మోడల్ ఫీచర్లు ఉండవు. తక్కువ బడ్జెట్‌లో పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కొనాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్. 

మహీంద్రా థార్ రాక్స్

ఇక మహీంద్రా థార్ రాక్స్ బేసిక్ మోడల్‌లో ఎంఎక్స్ఐ అనేది పెట్రోల్ ఇంజన్. ఇందులో 5 సీటర్ ఉంది. ఈ మోడల్ కూడా తక్కువ దరకే సొంతం చేసుకోవచ్చు. బేసిక్ మోడల్ కావడంతో హై ఎండ్ కార్లలో ఉండే ఫీచర్లు ఉండకపోవచ్చు. కానీ తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఆప్షన్ ఇది. పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కోసం అణ్వేషిస్తుంటే బెస్ట్ ఆప్షన్. 

మహింద్రా స్కార్పియో ఎన్ బేసిక్ వేరియంట్ జెడ్ 2 పెట్రోల్ ధర 14 లక్షల 35 వేల 199 రూపాయలు ఉంది. ఇది ప్రారంభ ధర. ఇక మహీంద్రా థార్ రాక్స్ బేసిక్ మోడల్ ఎంఎక్స్ఐ పెట్రోల్ వెర్షన్ ధర 12 లక్షల 99 వేలు. 

Also read: Saffron Benefits: చిటికెడు చాలు ఒకటా రెండా 8 రోగాలకు పరిష్కారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News