NPS Benefits: వృద్ధాప్యంలో సంరక్షణ, నెలకు 2 లక్షల పెన్షన్ పథకం ఎలా తీసుకోవాలంటే

NPS Benefits: పదవీ విరమణ అనంతరం లేదా వృద్ధాప్యంలో సంరక్షణ కోసం, ఆర్ధిక అవసరాల కోసం కొన్ని అద్భుతమైన పథకాలున్నాయి. ఇందులో పెట్టుబడితో నెలకు 2 లక్షల రూపాయలు పెన్షన్ తీసుకునే బంపర్ అవకాశం లభిస్తుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 10, 2023, 05:00 PM IST
NPS Benefits: వృద్ధాప్యంలో సంరక్షణ, నెలకు 2 లక్షల పెన్షన్ పథకం ఎలా తీసుకోవాలంటే

క్రమం తప్పకుండా పెట్టుబడి, సరైన ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ఎంచుకుంటే జీవితమంతా బాగుంటుంది. ఏ విధమైన ఆర్ధిక ఇబ్బందులు దరిచేరవు. కోటీశ్వరులు కూడా కావచ్చు. వీటికోసం కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు అందిస్తోంది. 

వృద్ధాప్యం భారం కాకుండా..మరొకరిపై ఆధారపడకుండా..హాయిగా జీవించేందుకు కొన్ని సురక్షితమైన సేవింగ్ పథకాలు ఉన్నాయి. ఆ పథకాల్లో ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ చేస్తే మీరు రిటైర్ అయిన తరువాత అద్భుతమైన ఫలితాలుంటాయి. ఈ సేవింగ్స్ ఉద్యోగంలో చేరిన తరువాత ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. రిటైర్‌మెంట్ ఫండ్ కోసం చాలా పథకాలున్నాయి. అందులో కొన్ని ఈపీఎఫ్, ఎన్‌పీ‌ఎస్, షేర్ మార్కెట్, మ్యూచ్యువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ రంగం వంటివి ఉన్నాయి.

వృద్ధాప్యంలో భవిష్యత్ సురక్షితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు అందిస్తోంది. మీరు ఉద్యోగస్థులైతే..పదవీ విరమణ తరువాత కూడా  ప్రతి నెల భారీగా పెన్షన్ తీసుకునేలా ఇప్పట్నించే ప్లాన్ చేసుకోవచ్చు. అయితే దీనికోసం ఇప్పట్నించే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే 60 ఏళ్ల తరువాత వృద్ధాప్యం భారం కాకుండా ఉంటుంది. 

నేషనల్ పెన్షన్ స్కీమ్ 

నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది  ప్రభుత్వ పెన్షన్ పథకం. ఇందులో ఈక్విటీ, డెబ్ట్ ఇన్వెస్ట్‌మెంట్ రెండూ ఉన్నాయి. ఎన్‌పీఎస్‌కు కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ లభిస్తుంది. రిటైర్‌మెంట్ తరువాత నెలనెలా పెన్షన్ కోసం ఇది మంచి పథకం. ఇది పీపీఎఫ్, ఈపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన లాంటి ప్రభుత్వ పథకం. ఇందులో ఎవరైనా సరే పెట్టుబడిదారుడు మెచ్యూరిటీ ఎమౌంట్‌ను సరిగా వినియోగించుకుంటే నెలవారీ పెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎన్‌పీఎస్ ద్వారా మీరు ఏడాదికి 2 లక్షల రూపాయల వరకూ ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఇన్‌కం‌ట్యాక్స్ సెక్షన్ 80 సి ప్రకారం అత్యధికంగా 1.5 లక్షల రూపాయలవరకూ ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెడితే..మీకు 50 వేల రూపాయలవరకూ అదనంగా ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. 

నెలకు 2 లక్షల రూపాయల పెన్షన్

ఎన్‌పీఎస్‌లో 40 ఏళ్ల వరకూ ప్రతి నెలా 5 వేలు రూపాయలు జమ చేస్తుంటే రిటైర్మెంట్ సమాయానికి 1.91 కోట్లు అందుతాయి. ఆ తరువాత మెచ్యురిటీ ఎమౌంట్ పెట్టుబడిగా పెడితే.. నెలకు 2 లక్షల రూపాయలు పెన్షన్ లభిస్తుంది. 
ఒకవేళ మీరు 20 ఏళ్ల నుంచి రిటైర్‌మెంట్ వరకూ ప్రతి నెలా 5000 రూపాయలు పెట్టుబడి పెడుతుంటే..1.91 కోట్ల నుంచి 1.27 కోట్ల వరకూ మెచ్యూరిటీ ఎమౌంట్ లభిస్తుంది. దీనిపై 6 శాతం రిటర్న్‌తో 1.27 కోట్ల రూపాయలపై ప్రతి నెలా 63,768 రూపాయలు పెన్షన్ వస్తుంది.

ఇందులో రెండు రకాలున్నాయి. మొదటి విధానంలో కనీస పెట్టుబడి 500 రూపాయలైతే..రెండవ విధానంలో 1000 రూపాయలు. గరిష్ట పరిమితి లేదు. ఇందులో పెట్టుబడి ఎందులోననేది తెలుసుకోవాలి. ఈక్విటీ, కార్పొరేట్ డేట్, ప్రభుత్వ బాండ్లు మూడు విధానాలున్నాయి. సాధారణంగా ఈక్వీటిలో రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి.

Also read: Bank Holidays: ఏప్రిల్ 2023లో 15 రోజులు పనిచేయని బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News