NPS 2023: పెన్షన్ విధానంపై కేంద్రం ముందడుగు.. లోక్‌సభలో ఆర్థిక మంత్రి ప్రకటన

Nirmala Sitharaman On NPS: పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి భారీ డిమాండ్ వస్తోంది. కొత్త పెన్షన్ విధానం తమకు వద్దని స్పష్టం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఎన్‌పీఎస్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ అంశాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2023, 04:05 PM IST
NPS 2023: పెన్షన్ విధానంపై కేంద్రం ముందడుగు.. లోక్‌సభలో ఆర్థిక మంత్రి ప్రకటన

Nirmala Sitharaman On NPS: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లు 2023ను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తామని ఆమె ప్రకటించారు. ఇందుకోసం జాతీయ పింఛను పథకానికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కమిటీ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తాయని తెలిపారు.  

ఆర్థిక మంత్రి బిల్లును సమర్పించే సమయంలో అదానీ హిండెన్‌బర్గ్ నివేదికపై ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. ఈ విషయమై జేపీసీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే ఓ వైపు ఎంపీల ఆందోళన కొనసాగుతున్న టైమ్‌లోనే ఆర్థిక బిల్లు 2023 పార్లమెంట్లో ఆమోదం పొందింది. 

అనంతరం ఆర్థిక మంత్రి శాఖ నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న జాతీయ పెన్షన్ విధానాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌కు సంబంధించిన అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో సంస్కరణలు అవసరమని అన్నారు. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద విదేశీ పర్యటనలపై క్రెడిట్ కార్డ్ చెల్లింపులను అంగీకరించడం లేదన్నారు. 

'ఆర్థిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన పెన్షన్‌ అంశాన్ని పరిశీలించి.. ఉద్యోగుల అవసరాలను తీర్చే విధానాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. సామాన్య పౌరులకు రక్షణ కల్పించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించేలా ప్రణాళిక సిద్ధం చేస్తాం..' అని నిర్మలా సీతారామన్ తెలిపారు.

ప్రస్తుం నేషనల్ పెన్షన్ స్కీమ్ విషయంలో కేంద్రం, ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల మధ్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. జాతీయ పెన్షన్ స్కీమ్‌కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలు చేస్తున్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించినందున ఎన్‌పీఎస్‌కు సంబంధించి కూడా వివాదం ముదురుతోంది. ఎన్‌పీఎస్‌ను సమీక్షించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. 

మరోవైపు ఎన్‌పీఎస్‌పై కమిటీ వేయడంలో రాజకీయ కోణం కూడా ఉందని చర్చ జరుగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది తర్వాత లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌ అంశం రాజకీయంగా మారుతున్న తరుణంలో ఎన్‌పీఎస్‌ను మెరుగుపరచడానికి మోడీ ప్రభుత్వం కమిటీ వేసేందుకు ముందుకు వచ్చింది.

 

Also Read: Rahul Gandhi: సంచలన నిర్ణయం.. రాహుల్ గాంధీపై వేటు.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు  

Also Read: AP MLC Elections Results: సీఎం జగన్ డేరింగ్ స్టెప్.. ఆ ఇద్దరికి నో టికెట్.. ఓడిపోతామని తెలిసినా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News