NPS Pension Scheme: నెలకు రూ.5000 పెట్టుబడి పెడితే చాలు.. రూ.1.91 కోట్ల మెచ్యురిటీ.. క్రేజీ స్కీం

NPS Pension Scheme: డబ్బులు సంపాదించేందుకు చాలా మార్గాలున్నాయి. కొన్ని రిస్క్‌తో కూడుకున్నవైతే..కొన్ని జీరో రిస్క్‌తో ఉన్నాయి. పదవీ విరమణ తరువాత కూడా నెలకు 2 లక్షలు సంపాదించే మార్గాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 29, 2022, 10:54 AM IST
NPS Pension Scheme: నెలకు రూ.5000 పెట్టుబడి పెడితే చాలు.. రూ.1.91 కోట్ల మెచ్యురిటీ.. క్రేజీ స్కీం

NPS Pension Scheme: క్రమం తప్పకుండా పెట్టుబడి, సరైన పథకాన్ని ఎంచుకుంటే.. కోటీశ్వరులు లేదా లక్షాధికారులు కావడం పెద్ద కష్టమేం కాదు. రిస్క్ లేకుండా అలా లక్షలు సంపాదించే మార్గాలు కూడా ఉన్నాయి. ఈ పథకాల ద్వారా రిటైర్మెంట్ తరువాత నెలకు 2 లక్షల రూపాయలు హాయిగా సంపాదించుకోవచ్చు.

సరైన పొదుపు, మంచి పధకాల్లో పెట్టుబడి ఉంటే వృద్ధాప్యం ఎప్పుడూ భారం కాదు. మీ వృద్ధాప్యం సురక్షితంగా ఉండాలంటే..ఆర్ధిక కష్టాలు లేకుండా సాగాలంటే..ఇప్పట్నించే సరైన ప్లానింగ్ అవసరం. రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఉద్యోగంలో చేరినప్పుడే ప్రారంభం కావాలి. రిటైర్మెంట్ ఫండ్ కోసం ఈపీఎఫ్, ఎన్‌పీఎస్, షేర్ మార్కెట్, మ్యూచ్యువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇలా చాలా మార్గాలున్నాయి.

ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి

రిటైర్మెంట్ సురక్షితంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు ప్రవేశపెట్టింది. ఇందులో పెట్టుబడి పూర్తిగా సురక్షితం. మీరు రిటైర్ అయిన తరువాత ప్రతినెలా పెద్దమొత్తంలో పెన్షన్ కావాలని ఉంటే..ఇవాళ్టి నుంచే పెట్టుబడి పెట్టాలి. పలితంగా 60 ఏళ్ల వయస్సు వచ్చిన తరువాత సెక్యూరిటీ ఉంటుంది.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ఓ ప్రభుత్వ పెన్షన్ పథకం. ఇందులో ఈక్విటీ, డెబ్ట్ ఇన్‌స్ట్రుమెంట్ రెండూ ఉన్నాయి. ఎన్‌పీఎస్ పథకానికి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. రిటైర్మెంట్ తరువాత భారీ మొత్తంలో పెన్షన్ కోసం ఎన్‌పీఎస్ మంచి పథకం కాగలదు. ఎన్‌పీఎస్ పధకం ద్వారా ఏడాదికి 2 లక్షల రూపాయలు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 80 సి ప్రకారం అత్యధికంగా 1.5 లక్షల రూపాయలు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. 

నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో 40 ఏళ్ల వరకూ నెలకు 5000 చొప్పున పొదుపు చేస్తే..రిటైర్మెంట్ అనంతరం 1.91 కోట్ల రూపాయలు లభిస్తాయి. మెచ్యూరిటీ ఎమౌంట్ పెట్టుబడిపై నెలకు 2 లక్షల పెన్షన్ లభిస్తుంది. సిస్టమెటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా 1.43 లక్షల రూపాయలు, నెలకు 63 వేల రూపాయలు లభిస్తాయి. ఇందులో పెట్టుబడి పెడితే..జీవించినంతవరకూ నెలకు 63 వేల పెన్షన్ అందుతుంది.

20 ఏళ్లలో 63,768 రూపాయల నెలవారీ పెన్షన్

మీరు 20 ఏళ్ల నుంచి రిటైర్మెంట్ వరకూ ప్రతి నెలా 5000 రూపాయలు పెట్టుబడి పెడితే..1.91 కోట్ల నుంచి 1.27 కోట్ల వరకూ మెచ్యురిటీ లభిస్తుంది. ఆ తరువాత 6 శాతం రిటర్న్‌తో 1.27 కోట్ల రూపాయలపై ప్రతినెలా 63,768 రూపాయలు పెన్షన్ లభిస్తుంది.

ఎన్‌పీఎస్‌లో రెండు రకాలున్నాయి. ఎన్‌పీఎస్ టైర్ 1, ఎన్‌పీఎస్ టైర్ 2. టైర్ 1 లో కనీస పెట్టుబడి 500 రూపాయలు కాగా, టైర్ 2లో 1000 రూపాయలు. ఇందులో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. 

Also read: Share Market: భారీగా పతనమైన ఆ కంపెనీ షేర్, తీవ్రంగా నష్టపోయిన ఇన్వెస్టర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News