Okaya Electric Scooter: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈ మార్కెట్‌ను క్యాష్ చేసుకునేందుకు పలు ఆటో కంపెనీలు పోటీపోటీగా ఇ-స్కూటర్లను (e-scooter) విడుదల చేస్తున్నాయి. వీటితో పాటు కొత్త స్టార్టప్ సంస్థలు కూడా ఇందులో అడుగుపెడుతున్నాయి.
తాజాగా ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఒకాయా గ్రూప్ ఫ్రీడమ్ (Freedum e-scooter) పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. దీని ధరను రూ. 69,900 గా నిర్ణయించింది. ఒకాయా ఇప్పటికే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్‌లో విక్రయిస్తోంది. అవియోన్ ఐక్యూ సిరీస్, క్లాస్ఐక్యూ సిరీస్ పేర్లతో ఇవి అందుబాటులో ఉన్నాయి. తాజాగా మూడవ ఉత్పత్తిగా విడుదలైన ఫ్రీడమ్ మోడల్ లిథియం అయాన్, లెడ్ యాసిడ్ బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది.
Also Read: Ola scooters: ఇ-కామర్స్ చరిత్రలో 'ఓలా' సరికొత్త రికార్డు...రెండు రోజుల్లో రూ. 1100 కోట్లు అమ్మకాలు..
ఒక్కో ఛార్జ్ కు గరిష్టంగా 250 కిలోమీటర్లు..
హిమాచల్ ప్రదేశ్‌లోని బద్ది తయారీ యూనిట్లో దీన్ని రూపొందించినట్లు ఒకాయా వెల్లడించింది. ఈ కొత్త మోడల్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో లో స్పీడ్, హై స్పీడ్ ట్రిమ్ వేరియంట్లు కూడా ఉంటాయి. ఈ స్కూటర్లు ఒక్కో ఛార్జ్‌కి గరిష్టంగా 250 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. ఈ కొత్త స్కూటర్ లాంచింగ్‌పై ఒకాయా పవర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గుప్తా మాట్లాడుతూ “ భారత్‌లో ఎలక్ట్రిక్ మార్కెట్ ఆశాజనకంగా ఉంది. ఈ మార్కెట్ భవిష్యత్తులో మరింత వృద్ధి చెందనుంది. ప్రతి భారతీయుడికి తాము పెట్టిన డబ్బకు అధిక నాణ్యత, విలువను అందించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మేము ఇప్పటికే ఎనర్జీ సొల్యూషన్స్ వ్యాపారంలో ఉన్నందున ఈ–మార్కెట్‌లో మాకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నాం” అని చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హై-స్పీడ్ మోటార్‌సైకిల్, ప్రత్యేక B2B వాహనాలతో సహా 14 కొత్త ఉత్పత్తులను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న 120 డీలర్షిప్ సెంటర్ల ద్వారా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో మరో 800 డీలర్షిప్ సెంటర్లను ప్రారంభించాలని ప్రణాళికలు రచిస్తోంది.
ఓలాకు గట్టిపోటీ..
జులై నెలలో ఓలా(OLA) కంపెనీ తన మొదటి ఇ-స్కూటర్‌ను లాంచ్ చేయగా.. కేవలం 24 గంటల్లోనే లక్షకు పైగా బుకింగ్స్ సాధించి రికార్డు నెలకొల్సింది. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా బుక్ చేసుకున్న స్కూటర్‌గా నిలిచింది. తాజాగా విడుదలైన ఒకాయా ఫ్రీడమ్ ఇ-స్కూటర్ ఓలా ఎస్1, ఎస్1 ప్రో వేరియంట్లకు గట్టి పోటీనివ్వనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook