Ola S1 X Electric Scooters: కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్.. డెడ్ చీప్ కాస్ట్.. సూపర్ మైలేజ్ రేంజ్

Ola S1 X Electric Scooters Prices and Ranges: ఓలా కంపెనీ నుండి మరో మూడు ఎలక్ట్రిక్ స్కూటీలు లాంచ్ అయ్యాయి. 2023 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈసారి మరింత సరసమైన ధరలకే ఓలా ఈ స్కూటీలను లాంచ్ చేసింది. 

Written by - Pavan | Last Updated : Aug 16, 2023, 05:31 AM IST
Ola S1 X Electric Scooters: కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్.. డెడ్ చీప్ కాస్ట్.. సూపర్ మైలేజ్ రేంజ్

Ola S1 X Electric Scooters Prices and Ranges: ఓలా కంపెనీ నుండి మరో మూడు ఎలక్ట్రిక్ స్కూటీలు లాంచ్ అయ్యాయి. 2023 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈసారి మరింత సరసమైన ధరలకే ఓలా ఈ స్కూటీలను లాంచ్ చేసింది. S1 X  రూ. 79,999 నుండి రూ. 99,999 ప్రారంభ ధరల వరకు ఈ మూడు వేరియంట్స్ లభించనున్నాయి. 2 kWh వేరియంట్ రూ. 79,999 ధరకే లభించనుండటం విశేషం.

2023 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ ఓలా S1 X సిరీస్ పేరుతో కొత్త సిరీస్‌ స్కూటర్లను విడుదల చేసింది. సెప్టెంబర్‌లో మొదటిరకం స్కూటీలు డెలివరీలు ప్రారంభం కానుండగా.. డిసెంబర్‌లో మిగిలిన రెండు వేరియంట్‌ల ఎలక్ట్రిక్ స్కూటీలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రకటించిన ఇంట్రడక్టరీ ఆఫర్ కింద ఆగస్ట్ 21 వరకు మాత్రమే ఈ తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఒక్కో వేరియంట్‌కు కనీసం రూ. 10,000 చొప్పున ధరలను పెంచేలా ఓలా మొదటి నుంచే ప్లాన్ చేసుకుంటోంది.

Ola S1 సిరీస్ ధర
Ola S1 ప్రో: రూ. 1,47,499
Ola S1 ఎయిర్: రూ. 1,19,999
Ola S1 X+: ఆగస్ట్ 21 వరకు రూ. 99,999 కాగా ఆ తరువాత రూ. 1,09,999
Ola S1 X: ఆగస్ట్ 21 వరకు రూ. 89,999 కాగా ఆ తరువాత అయ్యే ఖరీదు రూ. 99,999 గా ఉండనుది.
Ola S1 X (2kWh): ఆగస్ట్ 21 వరకు రూ. 79,999 కాగా ఆ తరువాతి నుండి రూ. 89,999 కి పెరగనుంది.

ఓలా S1 సిరీస్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే..
ఓలా S1 ప్రో
కొత్త S1 ప్రో యాక్సిలరేషన్ 2.6 సెకన్ల నుండి 60 కిమీ/గం. సింగిల్ చార్జింగ్ రేంజ్ వచ్చేసి 181 కి.మీ నుండి 195 కి.మీ రేంజ్ ఉంటుంది. ఈ రోజు కొనుగోలు కోసం బుకింగ్స్ ఓపెన్ అవుతుండగా.. సెప్టెంబర్ నెలలో వెహికిల్ డెలివరీలు ప్రారంభమవుతాయి.
బ్యాటరీ: 4kWh
రేంజ్ : 195 కిమీ 
గరిష్ట వేగం: 120 kmph

ఇది కూడా చదవండి : Tata Electric Cars: 1 లక్ష ఎలక్ట్రిక్ కార్లు అమ్మిన టాటా మోటార్స్‌.. ఎలాగంటే..

ఓలా S1 ఎయిర్
S1 ఎయిర్ కంటిన్యూవస్ ఔట్‌పుట్ కనిష్టంగా 2.7 kW కాగా గరిష్టంగా 4.5 kW కంటిన్యూయస్ ఔట్‌పుట్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.3 సెకన్లలో 0-40 kmph వేగం అందుకోగలదు. 90 kmph గరిష్ట వేగంతో ప్రయాణించే సామర్ధ్యం ఉంటుంది.
బ్యాటరీ: 3kWh
రేంజ్ : 151 కిమీ
హైయెస్ట్ స్పీడ్ : 90 kmph 

ఇది కూడా చదవండి : Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News