PNB KYC Update: ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆగస్టు 31వ తేదీ వరకు అవకాశం..!

Punjab National Bank KYC Status: ఈ నెల 31వ తేదీలోపు కేవైసీని అప్‌డేట్ చేయాలని కస్టమర్లను కోరింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు పంపించామని.. మొబైల్ ద్వారా సమాచారం అందించామని తెలిపింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 4, 2023, 08:26 AM IST
PNB KYC Update: ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆగస్టు 31వ తేదీ వరకు అవకాశం..!

Punjab National Bank KYC Status: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కస్టమర్లకు అలర్ట్. ఆగస్టు 31వ తేదీలోగా నో యువర్ కస్టమర్ (కేవైసీ) సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని పీఎన్‌బీ కోరింది. తమ ఖాతాదారులకు కేవైసీ అప్‌డేట్ చేయమని ఈమెయిల్స్, మెసెజ్‌ల ద్వారా సమాచారం అందిస్తోంది. ఈ నెల 31వ తేదీలోపు కేవైసీని అప్‌డేట్ చేయని కస్టమర్ల ఖాతాలు నిలిచిపోతాయని హెచ్చరించింది. ఆ తరువాత ఎలాంటి లావాదేవీలు చేసేందుకు అవకాశం ఉండదని పేర్కొంది. తమ బ్యాంక్ అకౌంట్‌లలో కేవైసీ అప్‌డేట్ చేయని కస్టమర్లందరికీ రెండుసార్లు నోటీసులు పంపినట్లు వెల్లడించింది. రిజిస్టర్ మొబైల్ నంబర్లు, ఈమెయిల్స్ ద్వారా రిమైండర్లు పంపించామని తెలిపింది. గడువు తేదీలోగా కేవైసీని పూర్తి చేయాలని కోరింది. ఆ తరువాత బ్యాంకింగ్ లావాదేవీలలో సమస్యలను ఎదురవుతాయని స్పష్టం చేసింది.

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం వినియోగదారులందరికీ కేవైసీ అప్‌డేట్ తప్పనిసరి అని పీఎన్‌బీ తెలిపింది. 2023 మార్చి 31 నాటికి కేవైసీ పూర్తి చేయనివారు ఉంటే.. మీరు PNB ONE/IBS/రిజిస్టర్డ్ ఇ-మెయిల్/పోస్ట్ ద్వారా లేదా ఆగస్టు 31వ తేదీలోపు ఏదైనా బ్రాంచ్‌కి వ్యక్తిగతంగా సందర్శించి కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా కూడా అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది.

కేవైసీ స్టాటస్‌ను ఇలా చెక్ చేసుకోండి

==> పీఎన్‌బీ నెట్‌బ్యాంకింగ్‌లో ఆన్‌లైన్‌లో లాగిన్ అవ్వండి
==> పర్సనల్ సెట్టింగ్స్‌లో కేవైసీ స్టాటస్‌ను చెక్ చేసుకోండి 
==> మీరు కేవైసీ అప్‌డేట్ చేయాల్సి ఉంటే.. డిస్ ప్లే చూపిస్తుంది. వెంటనే అప్‌డేట్ చేసుకోండి.  

కస్టమర్లు కేవైసీని అప్‌డేట్ చేయడానికి గుర్తింపు కార్డు, చిరునామా, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, పాన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, రిజిస్టర్ మొబైల్ నంబర్ అవసరమవుతాయి. ఈ వివరాలలో ఎలాంటి మార్పు లేకుంటే.. బ్యాంకును సందర్శించి స్వీయ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఈమెయిల్ ద్వారా కూడా బ్యాంక్‌కు సమాచారం అందించవచ్చు. ఈ సమాచారంలో ఏదైనా మార్పు జరిగితే.. అందుకు సంబంధించిన ప్రూఫ్‌ను అందజేసి అప్‌డేట్ చేసుకోవాలి. 

Also Read: Ind Vs WI 1st T20I Match Highlights: తొలి టీ20 విండీస్‌దే.. మ్యాచ్‌ గతిని మార్చేసిన ఆ ఒక్క ఓవర్‌..!  

Also Read: CM KCR: ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. పీఆర్‌సీ, ఐఆర్ ప్రకటన  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News