SBI interest rates: వడ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ.. కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే..

SBI hikes interest rates on FD: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెంచింది. కొత్తగా పెంచిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2021 నుంచే అమలులోకి వస్తాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) తమ తాజా ప్రకటనలో పేర్కొంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 05:32 PM IST
  • ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన SBI
  • డిసెంబర్ 15 నుంచే అమలులోకి పెంచిన రేట్లు
  • FD వడ్డీ రేట్లపై ఎస్బీఐ తాజా ప్రకటన
SBI interest rates: వడ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ.. కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే..

SBI hikes interest rates on FD: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెంచింది. రూ. 2 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో జమ చేసే బల్క్ టర్మ్ డిపాజిట్లపై ఈ పెంపు వర్తిస్తుందని ఎస్బీఐ ప్రకటించింది. 2 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తంలో ఉండే రీటేల్ టర్మ్ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు పెంపు వర్తించదని బ్యాంక్ స్పష్టంచేసింది. ప్రస్తుతం ఉన్నాదానికంటే 0.10 శాతం వడ్డీ రేటు పెంచినట్టు ఎస్బీఐ (SBI interest rates) తమ ప్రకటనలో పేర్కొంది. కొత్తగా పెంచిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2021 నుంచే అమలులోకి వస్తాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ తాజా ప్రకటనలో పేర్కొంది.

Also read : Bank Strike Today: నేటి నుంచి రెండు రోజులు బ్యాంకుల సమ్మె- కారణాలివే..

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (State Bank of India) టర్మ్ డిపాజిట్లపై కనీస వడ్డీ రేటు 3 శాతంగా ఉండగా.. సీనియర్ సిటిజెన్స్ చేసే డిపాజిట్లపై రూ. 3.50 శాతంగా ఉంది.

Also read : Flipkart Sale: రూ. 10,499కే 40 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో బంఫర్ ఆఫర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News