SBI Alert: అలాంటి మెస్సేజ్‌లపై తస్మాత్ జాగ్రత్త, వస్తే ఏం చేయాలి

SBI Alert: ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త విధానాలతో మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 27, 2024, 09:54 PM IST
SBI Alert: అలాంటి మెస్సేజ్‌లపై తస్మాత్ జాగ్రత్త, వస్తే ఏం చేయాలి

SBI Alert: సైబర్ మోసాలు, నేరాల విషయంలో తన కస్టమర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రమత్తం చేస్తోంది. ఫ్రాడ్ మెస్సేజిలకు ఎలాంటి రిప్లై ఇవ్వద్దని ఎస్బీఐ హెచ్చరిస్తోంది. తెలియని ఎస్ఎంఎస్‌లకు స్పందించవద్దని కోరుతోంది. 

ఆన్‌లైన్ నేరాలపై ఎస్బీఐ కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. ఎలాంటి మెస్సేజ్‌లకు స్పందించవద్దని, ఓటీపీ షేర్ చేయవద్దని, ఏ విధమైన వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దని కోరుతోంది. అలా చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. అలాంటి మెస్సేజిలకు స్పందిస్తే బ్యాంక్ ఎక్కౌంట్లు ఖాళీ అయిపోతాయని సూచిస్తోంది. దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ కలిగిన ఎస్బీఐకు 50 కోట్ల కస్టమర్లున్నారు. మోసపూరిత మెస్సేజ్‌ల గురించి కస్టమర్లకు ఎస్బీఐ అలర్ట్ పంపించింది. మీ ఎక్కౌంట్ క్లోజ్ కాగలదంటూ వచ్చే మెస్సేజ్‌లకు స్పందించవద్దని, అవి మోసపూరిత మెస్సేజ్‌లని చెబుతోంది. 

ఈ తరహా మెస్సేజ్‌లు వస్తే రిప్లై ఇవ్వద్దని ఎస్బీఐ సూచించింది. ఏ విధమైన వ్యక్తిగత సమాచారం లేదా ఓటీపీ లేదా ఎక్కౌంట్ వివరాలు ఇవ్వద్దని చెబుతోంది. డియర్ ఎక్కొంట్ హోల్డర్, మీ పాన్ కార్డు అప్‌డేట్ చేయకపోతే మీ ఎక్కౌంట్ క్లోజ్ అవుతుంది. ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ వచ్చే మెస్సేజ్‌లను పట్టించుకోవద్దని, పొరపాటున కూడా లింక్ క్లిక్ చేయవద్దని పదే పదే హెచ్చరిస్తోంది. ఇదో రకం మోసమని బ్యాంక్ అలర్ట్ చేస్తోంది. ఈ తరహా మెస్సేజ్‌లు వస్తే వెంటనే report.phishing@sbi.co.in.లకు రిపోర్ట్ చేయాలని సూచించింది. లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930ను సంప్రదించాలని చెబుతోంది. లేదా సైబర్ క్రైమ్ బ్రాంచ్ వెబ్‌సైట్ https://cybercrime.gov.in/. సందర్శించి ఫిర్యాదు చేయాలి. 

ఒకవేళ అలాంటి మోసాలు మీకు ఎదురైతే మీకు మోసం జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి. మీ డబ్బు వెనక్కి వచ్చేస్తుంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ముందుగా బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే బ్యాంకులు సైబర్ ఫ్రాడ్‌ను ఎదుర్కొనేందుకు ఇన్సూరెన్స్ తీసుకుంటుంటాయి. మీకు మోసం జరిగినట్టు తెలియపరిస్తే సంబంధిత బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఫార్వార్డ్ చేస్తాయి. తద్వారా మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి.

Also read; Ayodhya Ramlala Package: రామ మందిరం దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ సరికొత్త ప్యాకేజ్, మరో 3 జ్యోతిర్లింగాలు కూడా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News