Term Insurance Plan & Details: టర్మ్ ఇన్సూరెన్స్‌ తీసుకునే ముందు ఈ 7 విషయాలు తప్పక గుర్తుంచుకోండి

Term Insurance Benefits in Telugu: టర్మ్ ఇన్సూరెన్స్‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లయితే కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సరైన కంపెనీని ఎంచుకోవడంతోపాటు సెటిల్‌మెంట్ రేషియో ఎక్కువ ఉన్న వాటిని ఎంచుకోవడం ఉత్తమం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2023, 08:02 PM IST
Term Insurance Plan & Details: టర్మ్ ఇన్సూరెన్స్‌ తీసుకునే ముందు ఈ 7 విషయాలు తప్పక గుర్తుంచుకోండి

Term Insurance Benefits in Telugu: ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ తప్పనిసరి అయింది. ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్‌తో ఇన్సూరెన్స్ విలువ ఏంటో చాలా మందికి తెలిసింది. హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఆసుపత్రి ఖర్చులను తగ్గిస్తే.. టర్మ్, లైఫ్ ఇన్సూరెన్స్‌లు కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇస్తాయి. అనుకోకుండా చనిపోతే.. బీమా డబ్బులు కుటుంబానికి అండగా నిలుస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక కంపెనీలు బీమాను అందించేందుకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో సరైన కంపెనీని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే కొన్ని విషయాలు మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ కస్టమర్లకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. 

==> తక్కువ ధరలో ప్రీమియం

తక్కువ ధరలో ప్రీమియం చెల్లించి.. ఎక్కువ మొత్తంలో కవర్ చేసే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. నెలవారీగా/అర్ధ సంవత్సరం/సంవత్సరానికి ఎలా అయిన బీమాను చెల్లించవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్‌ను ప్లాన్‌ను త్వరగా తీసుకుంటే.. మీరు చెల్లించే ప్రీమియం కూడా తగ్గుతుంది. మీ వయసు పెరిగే కొద్ది బీమా ప్రీమియం కూడా పెరుగుతుంది. 

==> ఎక్కువ కాలం కవర్

చాలా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు చాలా కాలం కవరేజీని అందిస్తాయి. లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలు 99 ఏళ్ల వయస్సు వరకు కవరేజీని అందిస్తాయి.

==> సమ్ అష్యూర్డ్ చెల్లింపు

లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భంలో కుటుంబ సభ్యులు సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని చెల్లింపుగా స్వీకరిస్తారు. పాలసీదారు ఈ చెల్లింపును ఒకేసారి మొత్తం ఎంచుకోవచ్చు. ఇది ఇతర ఖర్చులు కాకుండా ఆర్థిక అవసరాలు, ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతుంది. 

Also Read: Higher EPS Pension: పీఎఫ్‌ ఖాతాదారులకు ముఖ్యగమనిక.. రేపటి వరకే లాస్ట్ ఛాన్స్

==> క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజ్ 

మీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో క్రిటికల్ ఇల్‌నెస్‌ కవరేజీని చేర్చినట్లయితే.. ప్లాన్ కింద కవర్ చేసిన ఏదైనా క్లిష్టమైన అనారోగ్యం నిర్ధారణ అయితే మీరు ఒకేసారి చెల్లింపును పొందే అవకాశం ఉంటుంది.

==> యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ 

టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్‌ను కూడా యాడ్ చేసుకోండి. భవిష్యత్‌లో మీరు ప్రమాదాలకు గురైనా ఆర్థికంగా రక్షణ కల్పిస్తుంది. 

==> టెర్మినల్ ఇల్‌నెస్‌లకు కవరేజ్ 

ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధుల నిర్ధారణ విషయంలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు మీకు ఒకేసారి చెల్లింపును అందుకోవచ్చు.

==> ట్యాక్స్‌బెనిఫిట్

సెక్షన్ 80సీ కింద చెల్లించిన ప్రీమియంపై అలాగే సెక్షన్ 80డీ కింద తీవ్రమైన అనారోగ్య ప్రయోజనాల కోసం చెల్లించిన ప్రీమియంపై ట్యాక్స్‌ బెనిఫిట్‌ను కూడా పొందవచ్చు. నామినీల ద్వారా సమ్ అష్యూర్డ్/డెత్ బెనిఫిట్‌గా పొందిన మొత్తం ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 10 (10డీ) కింద ట్యాక్స్‌ బెనిఫిట్ పొందొచ్చు.

Also Read: Aadhaar Card Photo Change: 8 ఏళ్ల బాలుడి ఆధార్‌ కార్డులో డిప్యూటీ సీఎం ఫొటో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News