Kuppam: తెలుగుదేశం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి షాక్ తగిలింది. సొంత నియోజకవర్గంలో ఘోర పరాభవం ఎదురైంది. కుప్పం మున్సిపాల్టీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్(Ysr Congress party) భారీ విజయం సాధించింది. తాడిపత్రి మున్సిపాల్టీ మినహాయించి మిగిలిన అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వివిధ కారణాలతో మిగిలిన మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికలు ఇప్పుడు పూర్తయ్యాయి. ఇవాళ ఆ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కుప్పం మున్సిపాల్టీలో ఉన్న 25 వార్డుల్లో ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్ని గెల్చుకుంది. తెలుగుదేశం(Telugu Desam) ఇప్పటివరకూ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కుప్పం మున్సిపాల్టీలో విజయం కోసం చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టినట్టు ప్రజలు మరోసారి నిరూపించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకుంటున్న చంద్రబాబుకు కుప్పంలో ఘోర పరాభావం ఎదురైంది.
Also read: Ship Repairing Unit: ఏపీలో త్వరలో షిప్ రిపేరింగ్, రీ సైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook