Gudlavalleru College Hidden Camera: తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతి కలిగించిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో రహాస్య కెమెరాల ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. వాష్‌రూమ్‌లలో రహాస్యంగా కెమెరాలు ఉంచారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ కళాశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కళాశాల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ విద్యార్థినులకు భరోసాగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో కళాశాలలో ఘటనకు కారణమైన ప్రధాన నిందితులైన విద్యార్థులు విజయ్ కుమార్, శ్రావణ సాత్వికపై కేసు నమోదైంది.
కృష్ణాజిల్లా గుడివాడకు సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో రహాస్య కెమెరాల విషయంపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది. నిందితుడు విజయ్ కుమార్, నిందితురాలు శ్రావణ సాత్వికపై కేసు నమోదైంది. క్రైమ్ నంబర్ 186/2024 గుడివాడ పోలీసులు నమోదు చేశారు. అండర్ సెక్షన్ 77 బీఎన్ఎస్, సెక్షన్ 66 ఐటీ యాక్ట్ ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: YS Jagan: గుడ్లవల్లేరు రహాస్య కెమెరాల ఘటనపై మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..?
గుడ్లవల్లేరు కళాశాల ఘటనలో ఎస్ఐ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బందోబస్తు విధుల కోసం వచ్చిన ఎస్ఐ శిరీషను అధికారులు వెనక్కు పంపారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. ఎస్పీ, కలెక్టర్‌లతో మాట్లాడి విచారణపై సమీక్ష చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ అధికారిగా సీఐ రమణమ్మను ఎస్పీ నియమించారు. ఆమె నేతృత్వంలో విచారణ జరుగుతుండగా.. బందోబస్తు కోసం పలు ప్రాంతాల నుంచి మహిళా పోలీసు అధికారులను, సిబ్బందిని నియమించారు.
ఈ సమయంలో కోడూరు ఎస్ఐ శిరీష విద్యార్ధినులతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో వెలుగు చూసింది. ఆ పోలీసు అధికారి తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులతో అధికారులు దురుసుగా ప్రవర్తించడం మంచిదికాదని.. ఇలాంటి పోకడలను సహించేదిలేదని సీఎం స్పష్టం చేశారు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరారు. దర్యాప్తు బృందంలో ఎస్ఐ శిరీష లేరని.. బందోబస్తు కోసం పిలిపించామని అధికారులు వివరించారు. ఘటన అనంతరం అమెను ఆ ప్రాంతంలో బందోబస్తు విధుల నుంచి ఇప్పటికే తప్పించామని సీఎంకు తెలిపారు. ఘటనపై ఎస్ఐ నుంచి వివరణ తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు. స్టూడెంట్స్ ఆవేదనను అర్థం చేసుకుని.. వారికి భరోసా ఇచ్చేలా అధికారులు వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.