Former Student Petrol Attack: మార్కుషీట్ ఇవ్వలేదని.. మహిళా ప్రిన్సిపాల్‌కు నిప్పంటించిన మాజీ విద్యార్థి

Former Student Sets Woman Principal On Fire: ఆ విద్యార్థి రెండు సెమిస్టర్లు పాస్ అయ్యాడు. తన మార్కుషీట్ కోసం కాలేజీ చుట్టు తిరిగాడు. అయినా ఇవ్వకపోవడంతో ఫ్యాకల్టీపై కత్తితో దాడి చేశాడు. జైలుకు వెళ్లి బెయిల్ విడుదలై.. మళ్లీ మహిళా ప్రిన్సిపాల్‌పై హత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె ప్రాణపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2023, 12:19 PM IST
  • మహిళా ప్రిన్సిపాల్‌పై మాజీ విద్యార్థి హత్యాయత్నం
  • మార్కులిస్టు కోసం వాగ్వాదం
  • గతంలోనే లెక్చరర్‌పై కత్తితో దాడి
Former Student Petrol Attack: మార్కుషీట్ ఇవ్వలేదని.. మహిళా ప్రిన్సిపాల్‌కు నిప్పంటించిన మాజీ విద్యార్థి

Former Student Sets Woman Principal On Fire: తన మార్కుషీట్ ఇవ్వడం లేదనే కోపంతో ఓ మాజీ విద్యార్థి ఏకంగా మహిళా ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసేందుకు యత్నించాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఫార్మసీ కాలేజీకి చెందిన మహిళా ప్రిన్సిపాల్‌పై మార్కుషీట్‌లు జారీ చేయడంలో జాప్యం చేసినందుకు ఓ మాజీ విద్యార్థి సోమవారం నిప్పంటించాడు. ప్రస్తుతం ఆమెకు 80 శాతం కాలిన గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రిలో చేర్చారు. బాధితురాలిని 50 ఏళ్ల విముక్త శర్మగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిమ్రోల్ ప్రాంతంలోని బీఎం ఫార్మసీ కాలేజీ క్యాంపస్‌లో సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు ఆమె కారు ఎక్కబోతుండగా ఈ ఘటన జరిగింది. అదేసమయంలో కళాశాలకు చెందిన మాజీ విద్యార్థి అశుతోష్ శ్రీవాస్తవ (22) ఆమె వద్దకు వచ్చి తన మార్కు షీట్ గురించి అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన శ్రీవాస్తవ.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ప్రిన్సిపాల్‌పై పోసి.. సిగరెట్ లైటర్‌తో నిప్పంటించాడు. ప్రస్తుతం 80 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

నిందితుడు బీఫార్మసీ కోర్సులో ఏడు, ఎనిమిదో సెమిస్టర్‌లలో సంబంధిత ప్రైవేట్ కళాశాలలో ఉత్తీర్ణుడయ్యాడని.. అయితే కాలేజీ యాజమాన్యం ఇంకా మార్కుషీట్ ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు. తన మార్కుషీట్ కోసం గతంలోనే కాలేజీ ఫ్యాకల్టీ సభ్యుడు విజయ్ పటేల్‌పై కత్తితో దాడి చేసినట్లు చెప్పారు. అరెస్టు చేసి పంపగా.. కొన్ని వారాల క్రితమే బెయిల్‌పై విడుదలయ్యాడని తెలిపారు. మళ్లీ ప్రిన్సిపాల్‌లోపై పెట్రోల్ దాడి చేశాడని పేర్కొన్నారు. 

నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ టెక్నలాజికల్ యూనివర్శిటీ (ఆర్‌జీపీవీ)కి అనుబంధంగా ఉన్న కళాశాల పాస్ అయిన స్టూడెంట్‌కు ఎందుకు మార్క్‌షీట్ ఇవ్వడం లేదో అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మార్కలు జాబితా తమ కాలేజీకి చేరలేదని యాజమాన్యం చెబుతోంది.  

Also Read: Chennai Super Kings: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ షెడ్యూల్ ఇదే.. ఆ ప్లేయర్ ఎంట్రీతో మరింత పవర్‌ఫుల్  

Also Read: Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. తిరుమలలో ఇక నుంచి కొత్త రూల్   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News