Criminal Husband: భార్యను తన స్నేహితులతో పడక పంచుకోవాల్సిందిగా ఫోర్స్ చేసిన భర్త

Husband forced wife to sleep with his friends: వృత్తిరీత్యా బాగా చదువుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయినప్పటికీ.. మానసికంగా అత్యంత క్రూరుడు అనిపించుకున్నాడు. తన పైశాచిక ఆనందంతో భార్యను చిత్రహింసలకు గురిచేశాడు.  వీడి దుర్మార్గాల గురించి ఇప్పుడు చెప్పుకున్నదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.

Written by - Pavan | Last Updated : Dec 11, 2022, 04:45 AM IST
Criminal Husband: భార్యను తన స్నేహితులతో పడక పంచుకోవాల్సిందిగా ఫోర్స్ చేసిన భర్త

Husband forced wife to sleep with his friends: భర్త అనేవాడు పరాయి నీచ పురుషుల నుంచి భార్యను కాపాడాలి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో భర్తే ఒక నీచుడు. పరాయి పురుషుల కన్ను పడకుండా భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్తే ఆమెను తన స్నేహితుల వద్దకు పంపించాడు. తన స్నేహితులతో పడక పంచుకోవాల్సిందిగా తీవ్రమైన వేధింపులకు గురిచేసి ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అంతటితో ఆ దుర్మార్గుడి ఆగడాలు ఆగలేదు. తానే భార్యను బలవంతం చేసి తన స్నేహితులతో కలిసి పడక పంచుకునేలా చేయడమే కాకుండా.. వారి ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి ఆమెపై మరిన్ని వేధింపులకు పాల్పడ్డాడు. ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూపించాడు. 

వృత్తిరీత్యా బాగా చదువుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయినప్పటికీ.. మానసికంగా అత్యంత క్రూరుడు అనిపించుకున్నాడు. తన పైశాచిక ఆనందంతో భార్యను చిత్రహింసలకు గురిచేశాడు.  వీడి దుర్మార్గాల గురించి ఇప్పుడు చెప్పుకున్నదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. భర్త చూపిస్తున్న ప్రత్యక్ష నరకం తట్టుకోలేక అతడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడింది ఆ బాధితురాలు. దాంతో తనలోని శాడిజంను రెండింతలు చేసి వేధించడం మొదలుపెట్టాడు. డైవర్స్ పేరెత్తినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా నీ ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. 

భర్త పెడుతున్న టార్చర్ తీవ్రస్థాయికి చేరడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఆ అమాయకురాలు పోలీసులను ఆశ్రయించింది. స్నేహితులతో పడుకునేటందుకు నిరాకరించానని తనను చిత్రహింసలు పెట్టింది మొదలు చివరి వరకు అతడి చేతిలో చవిచూసిన నరకాన్ని పోలీసులకు పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది.

భార్య ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. అల్కాహాల్, డ్రగ్స్‌కి బానిసైన తన భర్త.. తన సోదరిపైనా లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాధితురాలు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. గంజాయికి బానిసై ఇంట్లోనే రెండు గంజాయి మొక్కలు పెంచుతున్నట్టు ఆమె పోలీసులకు తెలిపారు. ఆమె చెప్పినట్టుగానే ఇంట్లో సోదాలు చేపట్టిన పోలీసులు.. ఇంటి ఆవరణలో పెంచుతున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని సంపిగెహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x