Train Accident: రైలులో డ్రైవింగ్‌ వదిలేసి మొబైల్‌ ఫోన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌.. ఇదే 14 మంది మృతికి కారణం

Kantakapalli Train Accident: ఒకే ఒక్క చిన్న కారణమే 14 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సిబ్బంది విధుల్లో చేసిన నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలు తీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి స్వయంగా వెల్లడిస్తూ....

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 3, 2024, 04:36 PM IST
Train Accident: రైలులో డ్రైవింగ్‌ వదిలేసి మొబైల్‌ ఫోన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌.. ఇదే 14 మంది మృతికి కారణం

Loco Pilot Watching Cricket: గతేడాది జరిగిన ఓ ఘోర ప్రమాదానికి కారణం సిబ్బంది నిర్లక్ష్యమేనని తెలిసింది. వేల మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న లోకో పైలెట్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే ఎంతటి ఘోర ప్రమాదం జరుగుతుందో కంటకపల్లి రైల్వే ఘటన చెబుతుంది. అయితే ఆ ఘటనకు లోకో పైలెట్‌, అతడి సహాయ లోకో పైలెట్‌ క్రికెట్‌ చూడడమే కారణమని తెలిపారు. క్రికెట్‌ చూస్తుండడంతో ముందు ఉన్న రైలును చూసుకోకుండా ఢీకొట్టారని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సంచలన విషయాన్ని వెల్లడించారు. 14 మంది మరణానికి కారణం వారు క్రికెట్‌ చూడడమేనని వివరించారు.

Also Read: Brutal Murder: షూట్‌కు పిలిచి ఫొటోగ్రాఫర్‌ను దారుణ హత్య..రూ.15 లక్షల విలువైన కెమెరాలతో పరార్‌

భారతీయ రైల్వే తీసుకుంటున్న భద్రతా చర్యలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భగా కీలక విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే కంటకపల్లి రైలు ప్రమాద విషయాన్ని ప్రస్తావించారు. 'ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ప్రమాదానికి లోకో పైలెట్‌, కో పైలెట్‌ ఇద్దరూ సెల్‌ఫోన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ పరధ్యానంలో ఉండడమే కారణం. ఇప్పుడు మేము అలాంటి తప్పిదాలను గుర్తించి పైలెట్లు, అసిస్టెంట్‌ పైలెట్‌ల పనితీరును నిర్ధారించేందుకు కొత్త వ్యవస్థలను తీసుకురాబోతున్నాం. దీనివలన పైలెట్లు రైలు నడపడంపైనే దృష్టి సారిస్తున్నారు. భద్రతపై పూర్తి దృష్టి సారిస్తాం. ప్రతి సఘటనకు ప్రధాన కారణం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మళ్లీ ఆ తప్పులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. 

Also Read: Mother Call Saved: కనిపించే దైవం అమ్మ ఇదిగో సాక్ష్యం.. తల్లి 'ఫోన్‌'తో కుమారుడికి పునర్జన్మ

ఏం జరిగింది?
ఏపీలోని విజయనగరం జిల్లా కంటకపల్లిలో 29 అక్టోబర్‌ 2024న సాయంత్రం 7 గంటల సమయంలో హౌరా-చెన్నై లైన్‌లో రాయగడ ప్యాసింజర్‌ రైలును వివాఖపట్టణం-పలాస రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. పట్టాలు అదుపు తప్పి బీతావహ దృశ్యాలు కనిపించాయి. బోగీలు నుజ్జనుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం వార్త తెలుసుకున్న సమయంలో నాడు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News