Brutal Murder: షూట్‌కు పిలిచి ఫొటోగ్రాఫర్‌ను దారుణ హత్య..రూ.15 లక్షల విలువైన కెమెరాలతో పరార్‌

Photographer Killed: ఫొటోగ్రఫీని అడ్డం పెట్టుకుని కొందరు యువకులు దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఫొటో షూట్‌ పేరు చెప్పి ఫొటోగ్రాఫర్‌ను పిలిచి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన....

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 3, 2024, 03:46 PM IST
Brutal Murder: షూట్‌కు పిలిచి ఫొటోగ్రాఫర్‌ను దారుణ హత్య..రూ.15 లక్షల విలువైన కెమెరాలతో పరార్‌

Photographer Murder: కొన్ని రోజుల పాటు ఫొటో షూట్‌ ఉంది అని పిలవడంతో ఫొటోగ్రాఫర్‌ వేరే గ్రామానికి వెళ్లాడు. ఫొటో షూట్‌ కోసం తనతో ఉన్న విలువైన కెమెరాలు, పరికరాలు పట్టుకెళ్లాడు. వెళ్లిన ఫొటోగ్రాఫర్‌ మూడు రోజులైనా ఇంటికి సమాధానం ఇవ్వలేదు. తల్లిదండ్రులు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని వస్తోంది. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టగా దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫొటోగ్రాఫర్‌ హత్యకు గురయ్యాడని.. ఫొటో షూట్‌కు పిలిచిన వారే ఘాతుకానికి పాల్పడ్డారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా ఫొటోగ్రాఫర్‌ను హత్య చేయడానికి గల కారణం కెమెరాలు, వాటి పరికరాలే. రూ.15 విలువైన కెమెరాల కోసం యువకులు అతడిని హత్య చేశారు. ఈ సంఘటన ఏపీలోని కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read: LPG Gas Cylinder Stole: దర్జాగా 'కారు'లో వచ్చి 'సిలిండర్‌' దొంగలించిన యువకులు

విశాఖపట్టణం పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మధురవాడ బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయికుమార్‌ (23) ఫొటోగ్రాఫర్‌. శుభకార్యాలు, ఫొటో షూట్‌లు, రీల్స్‌ వంటివి తీస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు తీసుకుని ఎక్కడైనా ఫొటో షూట్‌లు చేసేవాడు. ఈ క్రమంలోనే కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన షణ్ముఖ తేజతోపాటు మరో యువకుడు ఫొటో షూట్‌ కోసం సాయికుమార్‌ను సంప్రదించాడు. పది రోజుల పాటు ఫొటో షూట్‌ ఉందని ఫిబ్రవరి 26న చెప్పారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి సాయికుమార్‌ రాజమండ్రి వెళ్లేందుకు విశాఖలో రైలు ఎక్కాడు. తన వెంట రూ.15 లక్షల విలువైన కెమెరా సామగ్రి తీసుకెళ్లాడు. 

Also Read: Massive Fraud: ఎన్నారైని నిండా ముంచిన బ్యాంక్‌ మేనేజర్‌.. రూ.13 కోట్లు పోయాయంటూ మహిళ లబోదిబో

రాజమండ్రి చేరుకున్నాక ఇద్దరు యువకులు వచ్చి సాయికుమార్‌ను తమ కారు ఎక్కించుకున్నారు. రావులపాలెం సమీపంలోకి రాగానే ఇద్దరు వ్యక్తులు సాయికుమార్‌ను దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే పూడ్చి పెట్టారు. సాయికుమార్‌కు చెందిన కెమెరాతోపాటు ఇతర పరికరాలు ఎత్తుకెళ్లారు. వెళ్లినప్పటి నుంచి కుమారుడి నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వస్తోంది. కంగారుపడిన కుటుంబసభ్యులు విశాఖలోని పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టగా సాయికుమార్‌ హత్యకు గురయ్యాడని తేలింది. ఫోన్‌ డేటా విచారించగా షణ్ముఖతేజ ఆచూకీ లభించింది. 

వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు. రూ.15 లక్షల విలువైన కెమెరా సామగ్రి కోసమే ఈ హత్యకు పాల్పడ్డారని విచారణలో తెలిసింది. హత్య ఎలా చేశారనేది మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. కాగా పాతిపెట్టిన చోట మృతదేహాన్ని వెలికి తీసి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి మరింత విచారణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు పోలీసులు చేధిస్తున్నారు. కాగా పరారీలో ఉన్న యువకుడి ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News