14 Days Girlfriends Intlo: 14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో టీజర్ విడుదల.. ఆధ్యంతం నవ్వుకునేలా..!

14 Days Girlfriends Intlo Teaser: ‘14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో’ సినిమాకు సంబంధించిన స్నీక్ పీక్ లాంచ్ ఈవెంట్ జరగగా.. ఈ ఈవెంట్ కి ఈ సినిమా యూనిట్ మొత్తం అటెండ్ అయ్యి.. అల్లరించారు. అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నవ్వుల పంట పండించనుందని సినిమా యూనిట్ తెలిపారు. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 9, 2024, 03:41 PM IST
14 Days Girlfriends Intlo: 14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో టీజర్ విడుదల.. ఆధ్యంతం నవ్వుకునేలా..!

14 Days Girlfriends Intlo Teaser: 14 రోజులు గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటే ఏమవుతుంది..అనే వినూత్న కాన్సెప్ట్‌తో రాబోతున్న సినిమా 14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో. అంకిత్ కొయ్య హీరోగా, శ్రియా కొంతం హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని.. శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సత్య నిర్మించారు. శ్రీ హర్ష దర్శకత్వం వహించారు. సోమవారం నాడు ఈ సినిమాకి సంబంధించిన..స్నీక్ పీక్ లాంచ్ ఈవెంట్ జరిగింది.  

ఈ సందర్భంగా నిర్మాత సత్య మాట్లాడుతూ, ‘‘మా సినిమా ఆద్యంతం నవ్వించేలా ఉండటంతో.. పాటు మంచి సందేశాన్ని కూడా ఇస్తుంది. టీ హబ్‌లో ప్రారంభించిన మా ప్రొడక్షన్ హౌస్..ద్వారా టాలీవుడ్‌కు కొత్త కంటెంట్ అందించాలన్న లక్ష్యంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. సింగర్ కార్తీక్ పాట పాడడం, దీపక్ వంటి నిపుణులు మా టీమ్‌లో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాం’’ అన్నారు.  

హీరో అంకిత్ కొయ్య మాట్లాడుతూ, ‘‘ఈ సినిమా కథ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో 14 రోజులు.. ఉండాల్సిన పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. విభిన్నమైన కథాంశంతో, వినోదాన్ని ప్రధానంగా ఉంచుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. పూరి జగన్నాథ్ గారి దగ్గర పని చేసిన హర్ష ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు. వెన్నెల కిషోర్ ట్రాక్ కూడా నవ్వులు పంచుతుంది’’ అని చెప్పారు.  

సహ నిర్మాత నాగు మాట్లాడుతూ, ‘‘మా సత్య ఆర్ట్స్‌లో కో ప్రొడ్యూసర్‌గా భాగస్వామ్యం.. కావడం గర్వంగా ఉంది. కొత్త టీమ్‌ను మీడియా ప్రోత్సహించాలి’’ అని అభిప్రాయపడ్డారు.  

దర్శకుడు శ్రీ హర్ష మాట్లాడుతూ, ‘‘మేమంతా కొత్త వాళ్లం. టీ హబ్‌లో మా నిర్మాత సత్యను కలవడం, ఈ ప్రాజెక్టు పట్ల వారి ఆసక్తి మా లక్ష్యాన్ని.. ముందుకు తీసుకెళ్లింది. అంకిత్‌కు ఇది సోలో హీరోగా తొలి చిత్రం. మా చిత్రాన్ని ఎంకరేజ్ చేయండి’’ అన్నారు.  

మొత్తం మీద..అంతా కొత్తవాళ్లు కలసి తీసిన ఈ చిత్రం నవ్వుల పంట పండించి అందరి మనసులు గెలుచుకోవడానికి సిక్కమవుతుంది అని తెలిపారు సినిమా యూనిట్.

ఇదీ చదవండి: ఇందిరా దేవి మిస్సింగ్‌.. కావ్యకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన కల్యాణ్‌, ఎస్సై ట్రైనింగ్‌లో అప్పు అలా..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News