Samantha Yashoda: సమంత కోసం కళ్లు చెదిరే సెట్... ఈ సెట్ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?

Samantha Yashoda: సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం యశోద. అయితే ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ను రెడీ చేశారు మేకర్స్.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 06:33 PM IST
  • సమంత తాజా చిత్రం యశోద
  • మూడో వంతు షూటింగ్ హోటల్ సెట్ లో చిత్రీకరణ
  • భారీగా ఖర్చు చేసిన మేకర్స్
Samantha Yashoda: సమంత కోసం కళ్లు చెదిరే సెట్... ఈ సెట్ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?

Samantha Yashoda: చైతూతో విడాకుల తర్వాత సమంత (Samantha) పుల్ బిజీ అయిపోయింది. చేతి నిండా ప్రాజెక్టులతో దూసుకుపోతుంది.  'పుష్ప' సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఓ ఊపుఊపేసింది. సమంత తాజాగా నటిస్తున్న చిత్రం 'యశోద' (yashoda movie). సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రీదేవీ మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హరి-హరిష్‌ దర్శకులిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రంలో తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్  తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో దాదాపు రూ. 3 కోట్లు ఖర్చు చేసి హోటల్ సెట్​ను (hotel set) రూపొందించారు. తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సెట్ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

‘''యశోద సినిమాలోని మూడో వంతు భాగాన్ని లగ్జరీ హోటల్​లో తీయాల్సి ఉంది. దీని కోసం హైదరాబాద్‌లోని చాలా హోటల్స్‌ చూశాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 40 రోజుల పాటు హోటల్‌లో చిత్రీకరణ జరపడం కష్టమైన విషయం. అందుకే కళా దర్శకుడు అశోక్‌ నేతృత్వంలో హోటల్  సెట్స్‌ రూపొందిస్తున్నాం'' అని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌ అన్నారు. ఈ సినిమా షూటింగ్​ను ఏప్రిల్​ కల్లా పూర్తి చేస్తామని నిర్మాత వెల్లడించారు. 

Also Read: Kajal Photos: రెడ్ లెహంగాలో అదిరిపోయిన 'చందమామ' లాంటి ముద్దుగుమ్మ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News