Actor Simbu hospitalised due to viral infection: తమిళ హీరో శింబు వైరల్ ఇన్‌ఫెక్షన్(Viral infection)తో ఆస్రత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. శింబు తాజాగా నటిస్తున్న చిత్రం '‘వెందు తనిందదు కాడు'(Vendhu Thanindhathu Kaadu). ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautham Vasudev Menon) దర్శకుడు. కొన్ని వారాలుగా ఈ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్న శింబుకు నిన్న తీవ్ర జ్వరం, గొంతులో ఇన్‌ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అయితే ఇది మామూలు ఇన్ఫెక్షనేనని, కొవిడ్ కాదని వైద్యులు తెలిపినట్టు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.
Also Read: Sara Alikhan-Vijay Deverakonda: 'విజయ్ చాలా హాట్...అతనితో సినిమా చేయాలనుంది'..: సారా అలీఖాన్
ఇటీవలె శింబు నటించిన 'మానాడు'(Maanaadu) చిత్ర మంచి విజయం సాధించింది. అదే ఊపులో తన తదుపరి ప్రాజెక్టు '‘వెందు తనిందదు కాడు'ను పట్టాలెక్కించించాడు శింబు(Actor Simbu) . ఈ సినిమా అఖరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమా టీజర్(Teaser)ను శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది ఒక్క రోజులో యూట్యూబ్‌లో 3.7 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈశారి గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్(AR Rehman) సంగీతం అందిస్తున్నారు. ‘మన్మధ’, ‘వల్లభ’ వంటి చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు శింబు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Simbu: ఆస్పత్రిలో చేరిన తమిళ హీరో శింబు