Actor Suman Death News: సుమన్ ను చంపేసిన యూట్యూబ్ బ్యాచ్.. అసలు విషయం ఏమంటే?

Actor Suman Condemns His Death Rumors in Youtube Channels: కొన్ని నార్త్ యూట్యూబ్ ఛానల్స్ తెలుగు, తమిళ సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న సుమన్ మరణించారని థంబ్ నైల్స్ పెట్టి వీడియోలు వదిలాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 31, 2022, 06:17 PM IST
Actor Suman Death News: సుమన్ ను చంపేసిన యూట్యూబ్ బ్యాచ్.. అసలు విషయం ఏమంటే?

Actor Suman Condemns His Death Rumors in Youtube Channels: సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చాక ఎన్ని లాభాలు ఉంటున్నాయో అదే రేంజ్ లో నష్టాలు కూడా ఉంటు న్నాయి. మరీ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ అయితే సినీ సెలబ్రిటీలు బతికుండగానే చంపేస్తున్నాయి. చాలా మంది సెలబ్రిటీలు చనిపోయినట్లుగా ఫేక్ థంబ్ నైల్స్ పెట్టి యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ తెచ్చుకునే పనిలో ఉన్నాయి.

తాజాగా కొన్ని నార్త్ యూట్యూబ్ ఛానల్స్ తెలుగు, తమిళ సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న సుమన్ మరణించారని థంబ్ నైల్స్ పెట్టి వీడియోలు వదిలాయి. దీంతో ఆయన అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అసలు ఆయనకి ఏమైంది? నిన్నటిదాకా బాగానే ఉన్న వ్యక్తి చనిపోవడం ఏంటి అంటూ ఆరా తీస్తే అవన్నీ వ్యూస్  కోసం ఉత్తరాది యూట్యూబ్ బ్యాచ్ చేసిన పని అని తేలింది.

అయితే తన సన్నిహితుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న సుమన్ ఈ వార్తలను ఖండించారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని తన గురించి గానీ తన ఆరోగ్యం గురించి గానీ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఆయన తమిళ మీడియా ప్రతినిధులకు ఒక ప్రకటన జారీ చేశారు.  నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానన్న ఆయన సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నాను అని అన్నారు.

ప్రస్తుతం బెంగళూరులో తన సినిమా షూటింగ్ జరుగుతుందని ఆరోగ్యం పై ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి అన్న విషయం సన్నిహితులు ద్వారా తెలిసిందని దీంతో తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని అని చెప్పుకొచ్చారు. తన ఆరోగ్యం గురించి తప్పుడు ప్రచారం చేసిన నార్త్ యూట్యూబ్ ఛానల్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ చానల్స్ యాజమాన్యాల మీద పరువు నష్టం దావా వేస్తానని సుమన్ పేర్కొన్నారు. దీంతో సుమన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Malaika Arora Crush: అర్జున్ కపూర్ కాకుండా.. మరో హీరోపై కన్నేసిన మలైకా అరోరా!

Also Read: Jalsa Re Release: నిజాం కా నవాబ్ పవన్ కళ్యాణ్.. కానీ షరతులు వర్తిస్తాయి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News