Pooja Hegde Interesting Comments: బాహుబలి 3 పై పూజాహెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు

వరుస అవకాశాలతో జోరుమీదున్న పూజా హెగ్డే బాహుబలి 3 సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మరోసారి ప్రభాస్ తో జోడి కట్టడానికి నేను రెడీ అని ఇటీవల బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనసులో మాట చెప్పేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2022, 11:02 AM IST
  • వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే
  • టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్నిట్లో అవకాశాలు
  • బాహుబలి-3 పై షాకింగ్ కామెంట్స్ చేసిన పూజా హెగ్డే
Pooja Hegde Interesting Comments: బాహుబలి 3 పై పూజాహెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు

Pooja Hegde Interesting Comments: పూజా హెగ్డే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. తొలినాళ్లలో హిట్ కోసం ఎదురుచూసినా.. ఇటీవల ఈ అమ్మడు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. పూజా హెగ్డే నటించిన ప్రతి సినిమా హిట్ అవ్వటంతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతుంది. 

కుర్ర హీరోలతో సినిమాలు చేస్తూ.. క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది ఈ హీరోయిన్. ఇటు టాలీవుడ్ లోనే కాదు.. అటు కోలీవుడ్, బాలీవుడ్ లో సైతం అవకాశాలతో జోరు మీద ఉంది ఈ అమ్మడు. 

ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా నటించిన సంగతి తెలిసిందే.. సినిమా అనుకున్నంత స్థాయిలో లేకపోయిన.. వసూళ్ల పరంగా మంచి మార్క్ ను దాటేసింది. 

బాహుబలి-3లో హీరోయిన్‌గా నటిస్తానంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది నటి పూజ హెగ్డే. రాధేశ్యామ్ తో ప్రభాస్‌తో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ చిన్నది.. తన నెక్ట్ ప్రాజెక్ట్‌లపై పలు విషయాలు వెల్లడించింది. రాధేశ్యామ్‌లో ప్రభాస్, పూజ హెగ్డే .. కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడంతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే ఓ బాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. 

ఇక ప్రభాస్ ను పాన్ ఇండియా హీరోగా మార్చిన చిత్రాలు బాహుబలి 1, బాహుబలి 2 అన్న సంగతి తెలిసిందే. త్వరలో మూడో పార్ట్ రాబోతోందని డైరెక్టర్ రాజమౌళితో పాటు ప్రభాస్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో బాహుబలి -3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా ఎలా ఉండబోతోంది? అందులో నటించబోయేదెవరన్న చర్చ జరుగుతోంది. 

ఇలాంటి సమయంలో పూజా హెగ్డే కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అనీ.. ఒక వేళ ఛాన్స్ వస్తే బాహుబలి-3  చేయమనీ అందులో నన్నే హీరోయిన్‌గా తీసుకోమని చెబుతానంది పూజ. చూడాలి మరీ పూజా హెగ్డే కోరిక ఏ మేరకు తీరుతుందో.

Also Read: Pegasus in Ap Assembly: అసెంబ్లీలో పెగసస్ అంశంపై చర్చ, టీడీపీని ఇరుకునపెట్టే వ్యూహం

Also Read: Banks Privatization: ఆ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ త్వరలోనే, కేంద్రం కీలక చర్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News