Pragathi dance: నటి ప్రగతి తీన్మార్ డ్యాన్స్ అదుర్స్.. వీడియో వైరల్

టాలీవుడ్‌లో తల్లి పాత్రలు, అత్త పాత్రలతో బాగా పాపులర్ అయిన నటి ప్రగతి. పాత్ర ఏదైనా దానికితగినట్టుగా అందులో జీవించడం ప్రగతికి ఉన్న ప్లస్ పాయింట్. అలా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన నటనతో అందరినీ మెప్పించిన ప్రగతి.. బాద్‌షా సినిమాలో ఓ ఐటం సాంగ్‌‌కి సంబంధించిన చరణంపై సరదాగా స్టేప్పేయడం అప్పట్లో ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. కానీ బాద్‌షా చిత్రం వచ్చిన ఆరేళ్ల తర్వాత కూడా ప్రగతిలో పాజిటివ్ వైబ్స్ ఇంకా ఏం తగ్గలేదని నిరూపించే వీడియో ఒకటి తాజాగా వెలుగులోకొచ్చింది. 

Last Updated : Apr 14, 2020, 10:01 AM IST
Pragathi dance: నటి ప్రగతి తీన్మార్ డ్యాన్స్ అదుర్స్.. వీడియో వైరల్

టాలీవుడ్‌లో తల్లి పాత్రలు, అత్త పాత్రలతో బాగా పాపులర్ అయిన నటి ప్రగతి. పాత్ర ఏదైనా దానికితగినట్టుగా అందులో జీవించడం ప్రగతికి ఉన్న ప్లస్ పాయింట్. అలా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన నటనతో అందరినీ మెప్పించిన ప్రగతి.. బాద్‌షా సినిమాలో ఓ ఐటం సాంగ్‌‌కి సంబంధించిన చరణంపై సరదాగా స్టేప్పేయడం అప్పట్లో ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన యమగోల సినిమాలోంచి గుడివాడ వెళ్లాను.. గుంటూరు పోయాను అనే పాటపై బాద్‌షా సినిమా కోసం ప్రగతి చేసిన డ్యాన్స్ చూశాకా... ఆమెలో ఈ కోణం కూడా ఉందా అని చాలామంది ఆడియెన్స్ ఔరా అనుకున్నారు. కానీ బాద్‌షా చిత్రం వచ్చిన ఆరేళ్ల తర్వాత కూడా ప్రగతిలో పాజిటివ్ వైబ్స్ ఇంకా ఏం తగ్గలేదని నిరూపించే వీడియో ఒకటి తాజాగా వెలుగులోకొచ్చింది.

Also read: తెలంగాణలో కొత్తగా 61 కరోనా కేసులు, ఒకరి మృతి

కరోనావైరస్‌తో షూటింగ్స్ అన్నీ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు.. లాక్‌డౌన్ పీరియడ్‌ని తమకు తోచిన విధంగా ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటో, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రగతి కూడా అలాగే ఓ తీన్మార్ సాంగ్‌కి స్టేప్పేసి ఇంటర్నెట్‌ని షేక్ చేశారు. తమిళ స్టార్ హీరో విజయ్ ఇళయదళపతి నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ మాస్టర్ చిత్రంలో వాతి కమింగ్ అనే లేటెస్ట్ ఫాస్ట్ బీట్‌కి ప్రగతి వేసిన డ్యాన్స్ అదుర్స్ అనిపించుకుంది. అంతేకాదు.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గానూ మారింది.

తమిళ దర్శకుడు కనగరాజ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ యంగ్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విజయ్ స్టెప్పేసిన ఒరిజినల్ వాతి కమింగ్ అనే పాటను మార్చి 20న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా.. ఇప్పటికే ఆ పాటను 3.2 కోట్ల మంది వీక్షించారు. అటువంటి పాటపై జూనియర్ ఆర్టిస్ట్ ప్రగతి చేసిన ఈ డ్యాన్స్ అటు తమిళ తంబీలను సైతం ఆకట్టుకుంటోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News