Shriya Saran: నటి శ్రియ ఇప్పటిదాకా ఆర్ఆర్ఆర్ సినిమా చూడలేదంట..??

ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్ర పోషించిన శ్రియ ఇప్పటి వరకు సినిమా చూడలేదని.. ముంబాయి అంతటా సినిమా హాల్స్ ఫుల్ అని.. టికెట్లు కూడా దొరకలేదని చెప్తుంది... 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2022, 12:49 PM IST
  • ఇప్పటిదాకా సినిమా చూడలేదన్న ఆర్ఆర్ఆర్ నటి శ్రియ
  • లీడ్ రోల్స్‌లో తారక్‌, చరణ్‌ అని అప్పటికింకా తెలీదంట
  • ప్రతి సినిమా హాలు హౌస్‌ఫుల్.. టికెట్స్ దొరకట్లే అంటున్న నటి
Shriya Saran: నటి శ్రియ ఇప్పటిదాకా ఆర్ఆర్ఆర్ సినిమా చూడలేదంట..??

Shriya Saran: 'ఛత్రపతి' తర్వాత రాజమౌళితో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో నటించింది శ్రియ. కానీ తానింకా ఈ చిత్రం చూడలేదంటోంది శ్రియ. 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో అజయ్‌ దేవ్‌గణ్‌కు జోడీగా కనిపించింది శ్రియ. ఛత్రపతి తన కెరీర్‌లో సూపర్‌హిట్‌ సినిమా అని.. ఆ చిత్రం తర్వాత రాజమౌళి సినిమాలో అవకాశం వస్తే ఎలాగైనా నటించాలని చాలా ఏళ్ల నుంచి ఎదురుచూశానని అంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో శ్రియకు కీలకపాత్రగా నిలిచే సరోజిని పోషించే అవకాశం దక్కింది. రాజమౌళి టీమ్‌తో మళ్లీ పని చేయటం ఎంతో సంతోషాన్నిచ్చిందని శ్రియ పేర్కొంది. భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తే తప్పకుండా ఆయన సినిమాలో భాగం అవుతానంది శ్రియ.

ఎంతో ప్రయత్నించినప్పటికీ ఆర్ఆర్ఆర్ టిక్కెట్లు దొరకడం లేదని, ప్రతి చోటా హౌస్‌ఫుల్‌ బోర్డులే కనిపిస్తున్నాయంటోంది శ్రియ. "రాజమౌళి సినిమా అనగానే నా రోల్‌ ఏంటి? ఎవరెవరు పని చేస్తున్నారు? సహనటులు ఎవరు అని అడగలేదు. షూటింగ్‌ ప్రారంభమయ్యాకే తారక్‌, చరణ్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులని తెలిసింది. చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకుల స్పందన చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం పొందుతున్నా... చరణ్‌, తారక్‌లకు ఇన్నేళ్ల తర్వాత వాళ్ల స్టార్‌డమ్‌కు సరిపడా హిట్‌ వచ్చింది. 

నేనింకా "ఆర్‌ఆర్‌ఆర్‌" సినిమా చూడలేదు. సినిమా విడుదలైన సమయంలో నేను ముంబాయిలో ఉన్నాను. అక్కడ పలు థియేటర్లలో టిక్కెట్ల కోసం ప్రయత్నించాను. కానీ ఎక్కడా ఖాళీ లేదు. ప్రతి సినిమా హాలు హౌస్‌ఫుల్లే‌... ప్రస్తుతం వేరే సినిమా షూటింగ్‌ కోసం బెంగళూరు వచ్చా. ఇక్కడా థియేటర్లు ఫుల్‌. వచ్చేవారమైనా.. 'ఆర్‌ఆర్‌ఆర్‌' టికెట్లు దొరుకుతాయనుకుంటున్నా" అని చెప్పుకొచ్చింది శ్రియ.

Also Read: Atmakur Bypoll: ఆత్మకూరు ఉపఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ సతీమణి?

Also Read: Srisailam Temple News: శ్రీశైలంలో అర్ధరాత్రి కన్నడ భక్తుల వీరంగం.. దుకాణాలు, వాహనాలను ధ్వంసం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News