Akhil Akkineni: విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించాలనుంది: అఖిల్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ తీస్తే...అందులో నటించేందుకు తాను సిద్దమని టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ అన్నాడు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2021, 07:00 PM IST
Akhil Akkineni: విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించాలనుంది: అఖిల్

Akhil Akkineni: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది.  మరీ ముఖ్యంగా క్రికెట్‌లో ఈ హవా మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే మహేంద్ర సింగ్‌ ధోని(Dhoni Biopic) బయోపిక్‌, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ బయోపిక్‌లు రిలీజ్‌ కాగా.. ఈ ఏడాది క్రిస్మస్‌కు క్రికెట్‌ లెజెండ్‌ కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ విడుదల కానుంది. అయితే తాజాగా రన్నింగ్‌ మిషెన్‌, విరాట్‌ కోహ్లీపై బయోపిక్‌(Virat Kohli Biopic) రాబోతుందన్న వార్తలు వైరల్‌(Viral) అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. కోహ్లీ బయోపిక్‌ నిజంగానే తెరకెక్కితే.. ఆ మూవీలో తాను నటించేందుకు రెడీగా ఉన్నానని అక్కినేని అఖిల్ (Akhil Akkineni) అన్నాడు.

Also Read: The Baap Of All Talk Shows: బాలకృష్ణ టాక్ షోపై కీలక ప్రకటన చేయనున్న అల్లుఅరవింద్

ఇప్పటికే రణవీర్ సింగ్ హీరోగా కపిల్ దేవ్(Kapil Dev Biopic) జీవితంపై తెరకెక్కుతున్న 83 సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు అఖిల్‌. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో రూపొందే బయోపిక్(Biopic Movies) చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఇక ఎంతో మంది జీవితాలను విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రభావితం చేశాడని, అతడి బయోపిక్ తీస్తే బాగుంటుందని చెప్పాడు. క్రికెట్ మీద అతడికున్న ఫ్యాషన్ తో సినిమా తీస్తే.. చాలా అగ్రెసివ్‌గా ఉంటుందని, నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ బయోపిక్ తిరుగులేని కథగా నిలబడుతుందన్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News