Allu Arjun Fans : భోరుమంటూ ఏడ్చేస్తోన్న అల్లు అర్జున్ అభిమానులు.. బన్నీ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన

Allu Arjun Fans Cries అల్లు అర్జున్ అభిమానులు ప్రస్తుతం భోరున విలపిస్తున్నారు. అల్లు అర్జున్‌ను చూసేందుకు, కలిసి ఫోటోలు దిగేందుకు పడిగాపులు కాసిన అభిమానులకు చివరకు నిరాశ ఎదురైంది. దీంతో అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2023, 06:51 PM IST
  • అల్లు అర్జున్ అభిమానుల ఆవేదన
  • భోరున ఏడుస్తూ విలపిస్తున్న బన్నీ
  • బన్నీతో ఫోటోల కోసం నిరీక్షణ
Allu Arjun Fans : భోరుమంటూ ఏడ్చేస్తోన్న అల్లు అర్జున్ అభిమానులు.. బన్నీ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన

Allu Arjun Fans Cries అల్లు అర్జున్ అభిమానులు ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వైజాగ్‌లో పుష్ప రెండో భాగం షూటింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇంట్రో సాంగ్ కోసం బన్నీ అక్కడ చిందులు వేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా వైజాగ్‌లోనే బన్నీ ఉంటున్నాడు. ఈ క్రమంలో వైజాగ్ బన్నీ ఫ్యాన్స్ అంతా కూడా తమ అభిమాన హీరోను చూసేందుకు, ఫోటోలు దిగేందుకు పడిగాపులు కాస్తూ ఉన్నారట. దీంతో బన్నీ టీం స్పెషల్‌గా ఫోటో షూట్ ప్లాన్ చేసింది.

 

అనుకున్న దాని కంటే అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో.. ఆ ఫోటో షూట్ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేశారట. అభిమానులను కలవకుండా, ఫోటోలు దిగకుండానే బన్నీ వెళ్లిపోయాడట. దీంతో బన్నీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. గంటల కొద్దీ వెయిట్ చేశామని, ఇలా వెళ్లిపోవడం ఏంటి.. ప్రతీ సారి ఇలానే చేస్తున్నారు.. ఫోటోలు దిగుదామని, కలుద్దామని వచ్చిన అభిమానులను నిరాశతోనే పంపిస్తున్నారంటూ వాపోయారు.

గతంలోనూ ఇలానే జరిగిందని, ఈవెంట్‌ను సరిగ్గా ప్లాన్ చేయండంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే భోరున ఏడ్చేస్తున్నారు. వీటిని అయినా బన్నీ చూసి తన అభిమానుల కోసం వస్తాడా? లేదా? అన్నది చూడాలి. అసలే తమ తమ అభిమాన హీరోలను చూడాలని, ఫోటోలు దిగాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు.

కానీ హీరోలు ఇలా పదే పదే అభిమానులను పట్టించుకోకుండా పక్కన పెడితే వారికే నష్టం వాటిల్లుతుంది. అభిమానులే హీరోలకు,సినిమాలకు ఆయువు పట్టు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా వైజాగ్‌లో మెగా అభిమానుల హవానే ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

Also Read:  Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం

Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News