తరచూ వివిధ రకాల డ్రెస్సింగ్ల ద్వారా, హాట్ పోజుల ద్వారా వార్తల్లో ఉంటూ చర్చనీయాంశమయ్యే అనసూయ భరద్వాజ్ ఈసారి హాట్ కామెంట్లతో హాట్ టాపిక్‌గా మారింది. అందుకే ఆన్లైన్ ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. ఈసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు..తన సెక్యువాలిటీపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
ఎప్పుడూ ట్రోలింగ్ అవుతూ సోషల్ మీడియాలో హాట్‌గా ఉండే టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ మరోసారి చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను అశ్లీల లేదా అసహజ ప్రశ్నలతో వేధిస్తుంటారు. అయితే తన అభిప్రాయాల్ని వ్యక్తపర్చడంలో ఆమె ఎప్పుడూ వెనుకాడలేదు. అందుకే అనుసూయకు అభిమానుల్లో అంత క్రేజ్ అని చెప్పవచ్చు. తాజాగా అనసూయ ఇన్స్టాగ్రామ్ వేదికగా చాట్ నిర్వహించింది. ఈ చాట్‌లో అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు షాక్ అయ్యింది కూడా.
ఈ ప్రశ్నలు ఆమెను బాధించి ఉండవచ్చు. కానీ చాలా స్పోర్టివ్‌గా సమాధానమిచ్చింది. మహిళలతో లైంగిక సంబంధాలున్నాయా అనేది ఆ ప్రశ్న. స్వలింగ సంపర్కుల్లో స్నేహితులు, బంధువులు ఉన్నారు కానీ నాకెప్పుడు ఎదురు కాలేదని బదులిచ్చింది.
ఈ విధమైన జటిల ప్రశ్నల్ని సైతం ఆమె డీల్ చేసిన విధానం చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అభిమానులు అగ్రహించుకున్నప్పుడు కూడా అంతే చమత్కారంగా బదులిచ్చి చాట్ ముగించడం ఆమెకే చెల్లింది. యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందేనని చెప్పినప్పుడు కూడా లవ్ యూ బ్యాక్ అని ముగించేసింది.
వినూ వెంకటేశ్ తెరకెక్కిస్తున్న తమిళ సినిమా వోల్ఫ్లో అనసూయ నటిస్తోంది. ఈ సినిమా మొత్తం 60 రోజుల్లో తెరకెక్కింది. మార్చ్ 22వ తేదీన విడుదల కావచ్చని అంచనా. ఈ సినిమా ఫస్ట్‌లుక్ తరువాత సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా సైంటిఫిక్, హార్రర్ కాంబినేషన్‌గా ఉంటుంది. అంజూ కురియన్, లక్ష్మీ రాయ్, ఎంఎస్ భాస్కర్లు కీలకపాత్రల్లో కన్పించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook