Vishnu Priya At CCL : సెలెబ్రిటీ క్రికెట్ లీగ్‌.. అఖిల్‌ను తినేసేలా చూస్తున్న విష్ణుప్రియ.. పిక్స్ వైరల్

Celebrity Cricket League Matches సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచులు మూడేళ్ల తరువాత మళ్లీ మొదలయ్యాయి. ఆదివారం జరిగిన మ్యాచులో మన తెలుగు హీరోలు కేరళ వాళ్లను చిత్తుచిత్తుగా ఓడించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2023, 10:38 PM IST
  • సందడిగా మొదలైన సీసీఎల్
  • అదరగొట్టేసిన అక్కినేని అఖిల్
  • తినేసేలా చూస్తున్న విష్ణుప్రియ
Vishnu Priya At CCL : సెలెబ్రిటీ క్రికెట్ లీగ్‌.. అఖిల్‌ను తినేసేలా చూస్తున్న విష్ణుప్రియ.. పిక్స్ వైరల్

VishnuPriya for AKhil Akkineni యాంకర్ విష్ణుప్రియకు అఖిల్ అక్కినేని అంటే మహా ఇష్టం. పెళ్లి చేసుకునే చాన్స్ వస్తే చేసుకుంటాను అని బహిరంగంగానే ఎన్నో సార్లు చెప్పింది. అలా అఖిల్ అంటే తనకున్న పిచ్చి మీద ఎంత ట్రోల్స్, నెగెటివ్ కామెంట్లు వేసినా కూడా వెనక్కి తగ్గలేదు. మా అయ్యగారిని తినేస్తావా? అలా ఎందుకు చూస్తున్నావ్‌? అంటూ జనాలు మీమ్స్, ట్రోల్స్ వేసినా వాటిని లైట్ తీసుకుంటుంది.

అఖిల్ ఏదైనా ఈవెంట్‌కు వెళ్తున్నాడని తెలిస్తే అక్కడికి వెళ్తుంది. దూరం నుంచి అలా చూస్తూ ఉంటుంది. అఖిల్‌ను విష్ణుప్రియ చూసే తీరు ఎప్పుడూ మీమ్స్‌, ట్రోల్స్‌కు మంచి స్టఫ్‌గా మారుతుంటుంది. ఇప్పుడు అఖిల్‌ సీసీఎల్‌ కోసం రాయ్‌పూర్ వేదికగా నేడు జరిగిన మ్యాచ్లో అఖిల్ చెలరేగిపోయాడు. కేరళ స్ట్రైకర్స్‌తో మన తెలుగు వారియర్స్ టీం పోటీ పడింది. ఇక ఈ మ్యాచ్‌లో అఖిల్ వీరోచితంగా పోరాడాడు.

కేవలం ముప్పై బంతుల్లో 91 పరుగులు చేసి మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. చివరకు అఖిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో అఖిల్ దుమ్ములేపేస్తోంటే.. విష్ణుప్రియ మాత్రం అఖిల్‌ను చూస్తూ మురిసిపోయింది. దీంతో విష్ణుప్రియ చూపులు కెమెరా కళ్లకు చిక్కాయి.

విష్ణుప్రియ చూపుల మీద మరోసారి మీమ్స్, ట్రోల్స్ పడ్డాయి. అఖిల్‌ను చూశాక పాప చాలా హ్యాపీ అనుకుంటా అనే మీమ్‌కు ఇప్పుడు విష్ణుప్రియ స్పందించింది. అవును.. ఎంతో గ్రేట్‌ ఫుల్ అయ్యగారు అని విష్ణుప్రియ రిప్లై ఇచ్చింది. అసలే విష్ణుప్రియకు అఖిల్ అంటే చచ్చే అంత ఇష్టం.

విష్ణుప్రియ ఇప్పుడు శ్రీముఖికి దూరంగా ఉంటోన్నట్టుగా కనిపిస్తోంది. ఒకప్పుడు అయితే శ్రీముఖి గ్యాంగ్‌తోనే ఎక్కువగా కనిపించే విష్ణుప్రియ.. ఇప్పుడు రీతూ చౌదరితో మాత్రమే కనిపిస్తోంది. ఈ ఇద్దరే వెకేషన్లకు వెళ్తున్నారు. మాల్దీవులు, గోవా అంటూ ఈ ఇద్దరే హంగామా చేస్తున్నారు.

Also Read:  Taraka Ratna Death Live Updates: 'మోకిల' నివాసానికి చేరుకున్న తారకరత్న భౌతికకాయం..భోరున విలపిస్తున్న నందమూరి కుటుంబం

Also Read: Taraka Ratna Siva Devotee: శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యం.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News