Baby Movie: 'బేబీ' సినిమా మళ్లీ విడుదల.. తీసేసిన సీన్స్, సాంగ్ యాడ్ చేసిన టీం..

Baby Movie: 'బేబీ' సినిమాలో ఆనంద్, వైష్ణవిల నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడంటూ ఎవరూ ఉండరు. మెగాస్టార్ చిరంజీవి వైష్ణవిని అయితే సహజనటి జయసుధతో పోల్చారంటే.. ఆమె తన క్యారెక్టర్ లో ఎంతలా జీవించిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కొన్ని సన్నివేశాలతోపాటు సాంగ్ ను యాడ్ చేసి మూవీని రిలీజ్ చేయనున్నారట.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 6, 2023, 01:03 PM IST
Baby Movie:  'బేబీ' సినిమా మళ్లీ విడుదల.. తీసేసిన సీన్స్, సాంగ్ యాడ్ చేసిన టీం..

Baby Movie Release: ఇటీవల ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సినిమా 'బేబీ'(Baby Movie). ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల మందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చి కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇందులో ఆనంద్, వైష్ణవి అయితే తమ పాత్రల్లో జీవించేశారు. వీరిద్దరి నటన అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. ముఖ్యంగా యూత్ వీరి నటనకు ఫిదా అయింది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు రూ. 80 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఆనంద్, వైష్ణవి, విరాజ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. వీరికి ఆఫర్లు వెల్లువెత్తున్నాయి.

ఈ మూవీ రిలీజై 25 రోజులు పూర్తి చేసుకోవడంతో ఫ్యాన్స్ కు మరో క్రేజీ న్యూస్ అందించింది చిత్రయూనిట్. మూవీలో ఎడిటింగ్ లో తీసేసిన సీన్స్ తోపాటు మరోక సాంగ్ ను యాడ్ చేసి మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయనున్నాట మేకర్స్.  ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించింది. అలాగే ఇవాళ హైదరాబాద్ సంధ్య థియేటర్లో యాడ్ చేసిన సన్నివేశాలతో సాయంత్రం ఫస్ట్ షో వేసి అనంతరం అన్ని చోట్ల రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఈ నిర్ణయంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను ఎస్కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. 

Also Read: Game Changer Songs: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సాంగ్స్ కోసమే రూ.90 కోట్లా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News