బాలయ్య బాబు మాటలు శ్రద్ధగా వింటోన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

అబ్బాయిలిద్దరితో బాబాయి బాలకృష్ణ 

Last Updated : Sep 1, 2018, 11:16 AM IST
బాలయ్య బాబు మాటలు శ్రద్ధగా వింటోన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

నందమూరి కుటుంబంలో అన్నాదమ్ముళ్ల కుటుంబాలు, వారి పిల్లల మధ్య విభేదాలున్నాయనే ప్రచారం ఇవాళ కొత్తదేం కాదు. ముఖ్యంగా బాలయ్య బాబు, హరికృష్ణ కుటుంబాల మధ్య సరైన సత్సంబంధాలు లేవనేది ఆ ప్రచారం సారాంశం. పలు సందర్భాల్లో బాబాయితో అబ్బాయి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సన్నిహితంగా మెలిగిన సందర్భాలున్నప్పటికీ లోలోపల మాత్రం ఆత్మీయాతానురాగాలు లేవని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే, తాజాగా ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ మేమంతా ఒక్కటేనన్నట్టు కనిపించారు బాబాయి బాలయ్య బాబు, అబ్బాయిలు కళ్యామ్ రామ్, ఎన్టీఆర్. నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో ఆ కుటుంబం మరోసారి ఒక్కటైంది.

ఈ నేపథ్యంలో హరికృష్ణ మృతి అనంతరం నందమూరి కుటుంబం అంతా ఒక్క చోట చేరిన సందర్భంగా అబ్బాయిలిద్దరికీ బాలయ్య బాబు ఏదో విషయం చెబుతుండగా.. అలాగే బాబాయి అన్నట్టుగా ఆ అన్నాదమ్ముళ్లిద్దరూ శ్రద్ధగా వింటోన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకే ఫ్రేముల్లో బాబాయి-అబ్బాయిలను చూసిన నందమూరి అభిమానులు సైతం ఖుషీగా ఫీలవుతున్నారు. 

Trending News