Balakrishna@50Years: చిత్ర పరిశ్రమలో 50 నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనున్న బాలకృష్ణ.. నట సింహాన్ని సన్మానించనున్న తెలుగు చిత్ర పరిశ్రమ..

Balakrishna@50Years: తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ మరో మైలురాయిని చేరుకోనున్నారు. అంతేకాదు త్వరలో నటుడిగా 50 యేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తరుపున తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్  బాలయ్యను ప్రత్యేకంగా సన్మానించబోతుంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 12, 2024, 05:10 AM IST
Balakrishna@50Years: చిత్ర పరిశ్రమలో 50 నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనున్న బాలకృష్ణ.. నట సింహాన్ని సన్మానించనున్న తెలుగు చిత్ర పరిశ్రమ..

Balakrishna@50Years: శ్రీ  నందమూరి బాలకృష్ణ 50 యేళ్ల క్రితం  అంటే 30 ఆగష్టు 1974న విడుదలైన ‘తాతమ్మ కల’ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో తన తండ్రి ఎన్టీఆర్ తో పాటు అన్న హరికృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అంతేకాదు బాలయ్య నటించిన బ్యాక్ అండ్ ఫిల్మ్ కూడా . అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక నట వారసుడిగా అడుగుపెట్టి .. 50 యేళ్లుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్న వాళ్లు ప్రపంచ సినీ చరిత్రలో ఎవరు లేరు. మొత్తంగా ఓ నట వారసుడిగా 50 యేళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం మాములు విషయం కాదు. అంతేకాదు.. 50 కెరీర్ లో ఇప్పటికీ హీరోగా స్టార్ డమ్ అనుభవిస్తూ  కంటిన్యూ అవుతున్న నట వారసులు కూడా ప్రపంచంలో ఎవరు లేరు.

అంతేకాదు తొలి సినిమాలో ‘తాతమ్మ కలను నెరవేర్చే పాత్రలో టైటిల్ రోల్ పోషించారు. అంతేకాదు హీరోగా  తన కెరీర్లో 50 ఏళ్ల తర్వాత కూడా, సినిమా ఇండస్ట్రీలో   హ్యాట్రిక్ విజయాలతో కథానాయకుడిగా కొనసాగుతున్నారు. అంతేకాదు 50 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రల్లో హీరోగా కొనసాగుతున్న ప్రపంచంలోనే ఏకైక కళాకారుడు  నందమూరి బాలకృష్ణ.  ఆయన  గోల్డెన్ జూబ్లీ సినీ హీరో.  రాజకీయ రంగంలో, ఆయన వరుసగా మూడు సార్లు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు.  ఇప్పుడు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న హైదరాబాద్లోని బసవ తారకం ఇండో-బ్రిటీష్ క్యాన్సర్ హాస్పిటల్స్ కు  ఆయన ఛైర్మన్గా ఉన్నారు.

ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు ఆయన చేస్తోన్న కృషి మరువలేనిది. ఇక్కడ కేవలం భారతదేశం నుండి వచ్చిన రోగులు మాత్రమే కాకుండా విదేశాల నుండి వచ్చిన రోగులు కూడా మెరుగైన చికిత్స పొందుతున్నారు.  బాలకృష్ణ  ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. సినీ పరిశ్రమలో, రాజకీయ రంగంలో ఎమ్మెల్యేగా  కొనసాగుతూనేనే ప్రజాసేవలో ఆయన చేసిన సేవలు అందరి మెప్పు పొందుతున్నాయి.

ఈ సందర్భంగా శ్రీ నందమూరి బాలకృష్ణ గారు తన సినీ కెరీర్కి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  కె.ఎల్. దామోదర్ ప్రసాద్, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి  మరియు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు, సునీల్ నారంగ్, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, రీ టి. ప్రసన్న కుమార్, గౌరవ కార్యదర్శి మరియు కోశాధికారి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలచిత్ర నిర్మాతల మండలి,  మరియు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 క్రాఫ్ట్స్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియచేసారు. అంతేకాదు సినీ పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులు 1 సెప్టెంబరు 2024న తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయనకు సన్మానం చేయబోతోన్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఈ సన్మాన కార్యక్రమానికి అంగీకరించాల్సిందిగా బాలయ్యను అభ్యర్ధించారు. భారతీయ సినిమా  మరియు ఇతర రంగాలకు చెందిన  ప్రముఖులు కూడా ఈ సన్మాన సభలో పాల్గొనబోతున్నారు.  నందమూరి బాలకృష్ణ వారి అభ్యర్థనను అంగీకరించారు. ఆ తర్వాత వీరందరూ శ్రీ నందమూరి బాలకృష్ణ ధన్యవాదాలు తెలియజేసారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News