Unstoppable With NBK Season 4: బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. అన్‌స్టాపబుల్ సీజన్‌ 4 పై అఫీషియల్ ప్రకటన..

Unstoppable With NBK Season 4: నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ఆహా ఓటీటీ. ఇప్పటి వరకు బాలయ్య హోస్ట్‌గా 'అన్‌స్టాపబుల్ సీజన్ మూడు సీజన్లు విజయ వంతంగా పూర్తి చేసుకుంది. ఈ షో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ షోకు కొనసాగిపుంగా సీజన్ 4 త్వరలో రానుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 10, 2024, 06:06 AM IST
Unstoppable With NBK Season 4:  బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే న్యూస్..  అన్‌స్టాపబుల్ సీజన్‌ 4 పై అఫీషియల్ ప్రకటన..

Unstoppable With NBK Season 4: నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నడు లేనంతగా ఫుల్ ఊపు మీదున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో చాలా యేళ్ల తర్వాత హాట్రిక్స్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ మూవీగా రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు బాలయ్య సినిమా నటుడిగానే కాకుండా అన్‌స్టాపబుల్ షోకు హోస్ట్‌గా ఈ షోను బ్లాక్ బస్టర్‌గా నిలిబెట్టారు. ఇప్పటికే అన్‌స్టాపబుల్ మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మధ్యలో భగవంత కేసరితో పాటు యానిమల్ టీమ్ కోసం స్పెషల్ ఎపిసోడ్స్ మధ్యలో చేశారు. తాజాగా సీజన్‌ 4కు రంగం సిద్ధమైంది. ఉగాది సందర్బంగా ఈ ప్రోగ్రామ్ త్వరలో ప్రసారం చేయబోతున్నట్టు ఆహా ఓటీటీ అఫీషియల్‌గా ప్రకటించింది.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావారణంతో హడావుడిగా ఉంది. బాలకృష్ణ.. హిందూపురం నుంచి మూడోసారి తెలుగు దేశం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా  పోటీ చేస్తున్నారు. ఆ హడావుడి ముగిసిన తర్వాత 'అన్‌స్టాపబుల్ సీజన్ 4' స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు బాలయ్య.. త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' ప్రారంభం కానుంది. అయితే అన్‌స్టాపబుల్ టాక్ షో నాల్గవ సీజన్‌లో విత్ ఏ ట్విస్ట్ అంటూ కొంచెం సస్పెన్స్ మెయింటెన్ చేసారు. మరి 'అన్‌స్టాపబుల్ సీజన్ 4' షో ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read: Revanth Reddy Flight: రేవంత్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News