రామానుజాచార్య పాత్రలో బాలకృష్ణ..?

రామానుజాచార్య విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన హిందూ తత్వవేత్త. అలాగే ఆయనను కొందరు ఆస్తిక హేతువాది అని కూడా అంటారు.

Last Updated : Jan 20, 2018, 12:55 PM IST
రామానుజాచార్య పాత్రలో బాలకృష్ణ..?

రామానుజాచార్య విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన హిందూ తత్వవేత్త. అలాగే ఆయనను కొందరు ఆస్తిక హేతువాది అని కూడా అంటారు. అలాగే త్రిమతాచార్యులలో ద్వితీయుడు రామానుజాచార్యుడు. ప్రస్తుత ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి మానవ పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో, మార్చటమో చేయటం బ్రాహ్మణుల కర్తవ్యమని చాటిన వ్యక్తి రామానుజాచార్యుడు. ఆయన జీవితకథ ఆధారంగా  తెరకెక్కే చిత్రంలో తాను నటిస్తానని తెలిపారు ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ.

‘జై సింహా’ చిత్ర విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన తన 60వ ఏట రామానుజాచార్యుని పాత్రలో నటిస్తానని తెలిపారు. ఈ క్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘బ్రాహ్మణులుగా పుట్టడం పుణ్యం. వారి ఘనతను చాటి చెప్పేలా జైసింహా చిత్రంలో సన్నివేశాలున్నాయి. రామానుజాచార్యులు కూడా సమానత్వాన్ని చాటి, చాపకూటి సిద్ధాంతాన్ని గురించి తెలియజేశారు. అష్టాక్షరి మంత్రాన్ని కూడా ప్రచారం చేశారు. ఆయన పాత్రలో నేను నటించాలని అనుకుంటున్నాను" అని తెలిపారు. 

Trending News