Manchu Vishnu Tweet: నటి హేమకు అండగా మంచు విష్ణు.. అప్పటి వరకు ఆమె నిర్దోషే..

Actress  hema: బెంగళూరు రేవ్ పార్టీ ఘటన దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆమెకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా, దీనిపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చేసిన ట్విట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : May 25, 2024, 08:37 PM IST
  • నటి హేమకు సపోర్ట్ గా మంచు విష్ణు..
  • మీడియాలో ఆ కథనాలు ప్రచురించవద్దని రిక్వెస్ట్..
Manchu Vishnu Tweet: నటి హేమకు అండగా మంచు విష్ణు.. అప్పటి వరకు ఆమె నిర్దోషే..

Maa President Manchu vishnu Supports to Hema: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో.. ఈ రోజు బెంగళూరు పోలీసులు ఈ పార్టీలో ఉన్న వారికి నోటీసులు  జారీ చేసిన విషయం తెలసిందే.  సోమవారం రోజు తమ ముందు హజరు కావాలని పోలీసులు స్పష్టం చేశారు. నటి హేమతో పాటు ఈ ఘటనలో మరో 86  మందికి కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు జారీచేసినట్లు సమాచారం. బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో పోలీసులు 103 మందికి డ్రగ్స్ టెస్టులు చేయగా అందులో 86 మందికి పాజిటివ్ అని తెలింది. ఈ రేవ్ పార్టీలో రాజకీయ, సినిమా, బడాబాబుల పిల్లలున్నట్లు తెలుస్తోంది. అందరికి కూడా పోలీసులు వేర్వేరు తేదీలు ఇచ్చి, తమ ముందు విచారణకు హజరు కావాలని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా..  నటి హేమ ఘటన మాత్రం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

 

ఇదిలా ఉండగా..  నటి హేమ ఘటనపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. రేవ్ పార్టీ ఘటనలో కొన్ని మీడియా సంస్థలు నటి హేమపై నిరాధార కథనాలు ప్రచురిస్తున్నాయన్నారు. హేమ దోషిగా రుజువయ్యే వరకు కూడా ఆమె నిర్దోషే అంటూ స్పష్టం చేశారు. ఆమె సమాజంలో ఒకరి భార్యగా, ఒక తల్లిగా, ఒక నటిగా తనకంటూ గుర్తింపు ఉందని,ఇవన్ని కాపాడుకొవాల్సిన బాధ్యత ఉందని చెప్పుకొచ్చారు.

ఆమె ఇమేజ్ ను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించడం  అన్యాయమన్నారు. పోలీసులు ఖచ్చితమైన ఎవిడెన్స్ చూపించిన తర్వాత, నేరం రుజువైన తర్వాత మాత్రమే ఆమె తప్పుచేసినట్లని అన్నారు. బెంగళూరు పోలీసులు ఖచ్చితమైన ఎవిడెన్స్ అందజేస్తే.. మా తరపున కూడా తగిన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు అన్నారు. అప్పటి వరకు మాత్రం మీడియాలలో నిరాధార కథనాలు ప్రసారం చేయోద్దని ఆయన తన ట్విట్ లో పేర్కొన్నారు.  అంతేకాకుండా... మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుందన్నారు.  

Read more: Bengaluru rave party: రేవ్ పార్టీ ఘటనలో కీలక పరిణామం.. నటి హేమకు నోటీసులు..

ఇదిలా ఉండగా.. నటి హేమ.. బెంగళూరు రేవ్ పార్టీలో లేనని ఒక వీడియో రిలీజ్ చేశారు. తన ఫామ్ హౌజ్ లో ఉన్నానంటూ, చిల్ అవుతున్నానంటూ కూడా వీడియోలో చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా.. తన ఇంట్లో బిర్యానీ చేసి వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్న సమయంలో ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు. దీంతో ఆమెకు బిగ్ షాక్ తగినట్లు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో ఈరోజు ఆమెకు పోలీసులు సోమవారం తమ ముందు మే 27 హజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News