Balagam wins two more international awards: కొన్నాళ్ల క్రితం జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన బలగం సినిమా విడుదలై తెలుగులో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా ఈ సినిమాలో నటించ కేతిరి సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించారు.
పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా చిన్న సినిమాగానే రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేయడమే కాదు అదే స్థాయిలో అవార్డులను కూడా అందుకుంటుంది. ఇక పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో అనేక అవార్డులను అందుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తున్న బలగం సినిమాకి తాజాగా మరొక రెండు అవార్డులు దక్కాయి.
ఈ సినిమాకు సంబంధించి ఈ ఏడాది జరిగిన స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ యాక్టర్ గా ప్రియదర్శి అవార్డు గెలుచుకోగా ప్రియదర్శితో పాటు ఈ సినిమాలో ప్రియదర్శి తాత పాత్రలో నటించిన కేతిరి సుధాకర్ రెడ్డి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్నారు.
నిజానికి ఈ సినిమా ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డ్రామా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ సహా అనేక రంగాలకు సంబంధించి అవార్డులు అందుకుంది. ఇక 2021, 2022 సంవత్సరాలకు గాను బెస్ట్ మూవీస్ గా రెండు మలయాళ సినిమాలు కూడా అవార్డులు అందుకున్నాయి.
ఇక ఆ తర్వాత ఈ లిస్టులో బలగం సినిమా కూడా చేరి ఇప్పటివరకు స్వీడిష్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు దక్కించుకున్న మొదటి తెలుగు సినిమాగా నిలిచింది. ఇక ఈ మధ్యనే ఈ సినిమా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా అవార్డు అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ బలగం సినిమా ఇప్పటివరకు 40 కి పైగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుందంటే అతిశయోక్తి కాదు.
Also Read: Controversial Movies: పఠాన్ టు కేరళ స్టోరీ.. రిలీజ్ కు ముందే వివాదాలకు కారణమైన సినిమాలివే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook