Big King Cobra Video: కింగ్‌ కోబ్రాకు చుక్కలు చూపించిన జీన్స్ ప్యాంట్ అమ్మాయి.. వీడియో చూస్తారా?

Big King Cobra Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో కొండచిలువకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నటిజన్స్ దానిని పట్టుకోబోయిన యువతిని ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? పూర్తి వివరాలు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 25, 2024, 03:47 PM IST
Big King Cobra Video: కింగ్‌ కోబ్రాకు చుక్కలు చూపించిన జీన్స్ ప్యాంట్ అమ్మాయి.. వీడియో చూస్తారా?

Big King Cobra Video Watch Here: అనుకోకుండా పాములు కనిపిస్తే వాటిని చూసిన వెంటనే 20 అడుగుల దూరం పరిగెత్తే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది అయితే పామును చూసిన వెంటనే కేకలు వేసి భయభ్రాంతులకు గురై పరిగెత్తే వారిని చూసుంటాం కానీ ఇటీవలే ఓ యువతి భారీ కొండచిలువను చూడడమే కాదు.. ఏకంగా దానిని ఒంటి చేతితో పట్టేందుకు ప్రయత్నించింది. మామూలుగా కాదు.. కింద పడుతూ లేస్తూ ఒంటిచేత్తోనే పట్టుకోవాలని చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి చాలామంది స్నేక్ క్యాచర్స్ ఎలాంటి పాములనైనా పట్టుకోవడానికి కొన్ని పరికరాలను వినియోగిస్తూ ఉంటారు. కానీ ఈ యువతి మాత్రం కేవలం చేతులతో పట్టుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో.. ఆ అమ్మాయి చివరికి పామును పట్టుకుందో లేదో ఇప్పుడు తెలుసుకోండి. 

వీడియో వివరాల్లోకి వెళితే.. భారీ కింగ్‌ కోబ్రా బురదలోని పొలాల్లో సంచారం చేస్తూ ఉంటుంది. అయితే దీనిని గమనించిన ఓ జీన్స్ ధరించిన యువతి ఆ పామును చేప అనుకొని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతలోనే పామని తెలుసుకొని ఆమె వంగి పాము తోకను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఆ పాము మాత్రం బుసలు కొడుతూ పారిపోయే ప్రయత్నం చేస్తుంది. ఇలా ఆ యువతి రెండుసార్లు పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ ఆ పాము చిక్కకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. చివరికి మరోసారి కూడా పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ సమయంలో ఆ పాము ఆమె వైపుకు తిరిగి కాటేసే ప్రయత్నం చేస్తుంది. దీనిని ముందే గమనించిన ఆ యువతి పాము చేతుల నుంచి తప్పించుకుంటుంది. అయినప్పటికీ ఆ యువతి వదలకుండా మరోసారి ప్రయత్నం చేస్తుంది. దీంతో ఆ పాము భయాందోళనకు గురై జరజర పాకుతూ పారిపోవడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News