Samrat Reddy: రెండో వివాహం చేసుకున్న బిగ్‌బాస్ ఫేం సామ్రాట్ రెడ్డి

Samrat Reddy Marries Sri Likhitha | కరోనా కాలంలో టాలీవుడ్‌లో మోగిన పెళ్లి బాజాలు మరెక్కడా మోగలేదేమో అనిపిస్తుంది. దిల్ రాజు పెళ్లి మొదలుకుని చూస్తే ఇటీవల నిహారిక నిశ్చితార్థం జరిగింది.  తాజాగా టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ పెళ్లిపీటలెక్కారు. బిగ్‌బాస్ 2 ఫేం సామ్రాట్ రెడ్డి ఇటీవల రెండో వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.

Last Updated : Nov 5, 2020, 01:14 PM IST
  • కరోనా కాలంలో టాలీవుడ్‌లోని పెళ్లి బాజాలు మరెక్కడా మోగలేదేమో
  • తాజాగా టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ వివాహం చేసుకున్నారు
  • ఇటీవల రెండో వివాహం చేసుకున్న బిగ్‌బాస్ 2 ఫేం సామ్రాట్ రెడ్డి
Samrat Reddy: రెండో వివాహం చేసుకున్న బిగ్‌బాస్ ఫేం సామ్రాట్ రెడ్డి

ఈ ఏడాది కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేసింది. ఆర్థిక సంక్షోభంలోకి ఎన్నో దేశాలను నెట్టింది. భారత్‌లోనూ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. అయితే కరోనా కాలంలో టాలీవుడ్‌లో మోగిన పెళ్లి బాజాలు మరెక్కడా మోగలేదేమో అనిపిస్తుంది. దిల్ రాజు పెళ్లి మొదలుకుని చూస్తే ఇటీవల నిహారిక నిశ్చితార్థం జరిగింది.  తాజాగా టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ పెళ్లిపీటలెక్కారు. బిగ్‌బాస్ 2 ఫేం సామ్రాట్ రెడ్డి (Samrat Reddy) ఇటీవల రెండో వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.

 

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సామ్రాట్ రెడ్డి, శ్రీ లిఖితల వివాహం (Samrat Reddy Ties The Knot With Sri Likhitha) జరిగింది. కేవలం ఇరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు సమక్షంలో శ్రీ లిఖిత మెడలో సామ్రాట్ మూడు ముళ్లు వేశారు. సామ్రాట్ వివాహాని (Samrat Reddy Wedding)కి తోటి బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్స్, స్నేహితులు తనీష్, దీప్తి సునయన, తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ 2 సమయంలోనే తన వ్యక్తిగత జీవితంలో కొంతమేర కలిసిరాలేదని నటుడు సామ్రాట్ రెడ్డి చెప్పడం, అతడికి కుటుంబసభ్యులు అండగా నిలవడం తెలిసిందే.

 

గతంలో హర్షిత రెడ్డిని సామ్రాట్ రెడ్డి వివాహం చేసుకున్నారు. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం. దీంతో కుటుంబసభ్యులు సామ్రాట్‌కు మరో వివాహం చేశారు. సామ్రాట్ రెడ్డి పెళ్లి ఫొటోలను ఆయన సోదరి శిల్పారెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

 అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే జీ హిందుస్థాన్ యాప్ (Zee Hindustan App) డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News